యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ చిత్ర బృందం

Action Scenes Shoot Doing Pawan Kalyan Film Team
x

యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ చిత్ర బృందం

Highlights

"హరి హర వీర మల్లు" లో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్న బృందం

Hari Hara Veera Mallu: "వకీల్ సాబ్" మరియు "భీమ్లా నాయక్" సినిమాలతో మంచి హిట్ సినిమాలను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. ఒకవైపు రాజకీయ పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి త్వరగా సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ షూటింగ్ తిరిగి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం చిత్ర షూటింగ్ ఎప్పుడు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఇప్పుడు చిత్ర బృందం సినిమా ఇంటర్వల్ లో వచ్చే ఒక భారీ యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గడ్డం తో మ్యాచో లుక్ తో కనపడనున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ షెడ్యూల్ ఒకటి రెండు వారాల పాటు జరగనుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ త్వరలో పూర్తి చేసి వచ్చే ఏడాది ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ చేతిలో కొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి కానీ వాటి విడుదల గురంచి మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories