RRR Movie Update: ప్రేక్షకులను కేక పెట్టించే యాక్షన్ ఎపిసోడ్స్

Action Scenes in Rajamouli RRR Movie will Impress The Audiences
x

ఆర్ఆర్ఆర్ సినిమా

Highlights

RRR Movie Update: రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే చిత్రం 'ఆర్ఆర్ఆర్' పై అంచనాలు ఫీక్స్ లో ఉన్నాయి.

RRR Movie Update: రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే చిత్రం 'ఆర్ఆర్ఆర్' పై అంచనాలు ఫీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమా పై వచ్చే ప్రతీ అప్‌డేట్ నెట్టింట్లో తుఫానుగా మారుతోంది.

గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలపై చాలా వార్తలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్, పులి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది. అలాగే, రామ్ చరణ్ కూడా ఓ ఇంట్రస్ట్ యాక్షన్ సీన్ చేస్తున్నాడంట. అండర్ వాటర్ లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారంట. ఇది సినిమాలో ప్రీ-ఇంటర్వెల్ లో వస్తుందని టాక్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేయనున్నారు. అలాగే కాలా భైరవ స్వరంతో నేపథ్యంలో వచ్చే పాట ప్రేక్షకులను కేకలు పెట్టిస్తుందని అంటున్నారు.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమారాం భీమ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 13 న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories