"సలార్"లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో కనులవిందు చేయబోతున్న యంగ్ రెబల్ స్టార్

Action Scenes Give Eye Feast to Fans in Prabhas Salaar Movie | Live News Today
x

"సలార్"లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో కనులవిందు చేయబోతున్న యంగ్ రెబల్ స్టార్

Highlights

Prabhas - Salaar: "కే జి ఎఫ్: చాప్టర్-2" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్...

Prabhas - Salaar: "కే జి ఎఫ్: చాప్టర్-2" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "సలార్". ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ మధ్యనే "రాధే శ్యామ్" ఈ సినిమాతో ఊహించని డిజాస్టర్ ను అందుకున్న ప్రభాస్ ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఎలాగైనా ప్రభాస్ కి మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథ పైన రీ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమాలో భారీగా యాక్షన్ మరియు ఎమోషన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

"రాధే శ్యామ్" సినిమాలో యాక్షన్ సన్నివేశాలను మిస్సయిన అభిమానులకు ఈ సినిమా కనుల విందుగా ఉండబోతుందట. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories