'సరిలేరు నీకెవ్వరు' నుంచి యాక్షన్ స్టంట్స్.. మహేశ్ అదరగొట్టాడు

సరిలేరు నీకెవ్వరు నుంచి యాక్షన్ స్టంట్స్.. మహేశ్ అదరగొట్టాడు
x
Mahesh Babu Sarileru Neekevvaru File Photo
Highlights

సరిలేరు నీకెవ్వరు సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద...

సరిలేరు నీకెవ్వరు సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహేష్ నుంచి మంచి హిట్ మూవీ రావడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

అయితే తాజా ఈ సినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ సన్నివేశాలను సినిమా యూనిట్ అభిమానులతో పంచుకుంది. సిల్వర్ స్రీన్‌పై అద్భుతంగా పండిన సన్నీవేశాలు తెరకెక్కించడానికి సినిమా యూనిట్ పడిన క‌ష్టాన్ని ఇందులో చూపించారు.

ఇక సరిలేరు నీకెవ్వరు ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. మహేష్ బాబు ఇందులో మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. ఈ సినిమా విజయం సాధించడంతో దర్శకుడు అనిల్ తో మరో సినిమాని చేయడానికి ఫిక్స్ అయ్యాడు మహేష్. తాజా విడుదల చేసిన ఈ స్టంట్స్ ను మీరు చూడండి..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories