logo
సినిమా

Acharya: రేట్లు తగ్గించిన ఆచార్య దర్శకనిర్మాతలు

Acharya Movie Producers Decreases the Satellite Price
X

ఆచార్య మూవీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Acharya: తక్కువ ధరకే సాటిలైట్స్ ను అమ్మనున్న ఆచార్య దర్శకనిర్మాతలు

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, పూజా హెగ్డే రామ్ చరణ్ తో జాతకట్టనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో దర్శక నిర్మాతలకు శాటిలైట్ రైట్స్ రూపంలో బోలెడు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కు షాక్ ఇచ్చారు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోకపోవడంతో దర్శకనిర్మాతలకు క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం ఉన్న సమయం లో భారీ మొత్తాన్ని డిమాండ్ చేయకుండా కేవలం రీజనబుల్ ప్రైస్ రేట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను అమ్మాలని నిర్ణయించుకున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా వారు "ఆచార్య" దర్శక నిర్మాతలతో భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో స్టార్ మా "ఆచార్య" సినిమా కి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకునేందుకు ఒక డీల్ కుదుర్చుకోబోతున్నారు. రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Web TitleAcharya Movie Producers Decreases the Satellite Price
Next Story