Saif Ali Khan Stabbed: నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

Accused in Saif Ali Khan Held
x

సైఫ్ అలీఖాన్ పై దాడి: నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

Highlights

Saif Ali Khan Stabbed: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Saif Ali Khan Stabbed: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లోని నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై గురువారం తెల్లవారుజామున దుండగుడు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఖాన్ కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.

సైఫ్ అలీఖాన్ బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్ మెంట్ లోని 12వ అంతస్తులో ఉంటున్నారు. ఈ భవనంలోకి నిందితుడు ఎలా వచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడిని బాంద్రా రైల్వేస్టేషన్ లో తిరిగినట్టు పోలీసులు సీసీటీవీల్లో చూశారు. ఈ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ వీడియో దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి సైఫ్ కొడుకు సహాయకురాలు ఎలియామా ఫిలిప్ ను కోటి డిమాండ్ చేశారు. ఆమె గట్టిగా కేకలు వేశారు. నిందితుడిని నిలువరించే ప్రయత్నం చేశారు.ఈ సమయంలో నిందితుడు ఆమెపై దాడికి దిగారు. ఈ అరుపులు విన్న సైఫ్ అలీఖాన్ అక్కడికి చేరుకోగానే నిందితుడు అతనిపై కూడా దాడి చేసి నిందితుడు పారిపోయారు. సైఫ్ ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం ఆయనకు శస్త్రచికిత్స చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories