Prabhas: ప్రభాస్‌-హనురాఘవపూడి సినిమాలో మరో హీరోయిన్‌.. రెబల్‌ స్టార్‌తో జతకట్టనున్న నేచురల్‌ బ్యూటీ

According to the latest buzz Sai Pallavi is going to act in Prabhas Hanu Raghavapudi movie
x

Prabhas: ప్రభాస్‌-హనురాఘవపూడి సినిమాలో మరో హీరోయిన్‌.. రెబల్‌ స్టార్‌తో జతకట్టనున్న నేచురల్‌ బ్యూటీ

Highlights

Prabhas: బాహుబలి మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదిగారు. కల్కితో ఆయన ఇంటర్నేషనల్ హీరోగా మారారు.

Prabhas: బాహుబలి మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదిగారు. కల్కితో ఆయన ఇంటర్నేషనల్ హీరోగా మారారు. ప్రభాస్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండుగే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఓవైపు సలార్‌ 2తోపాటు, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌, కల్కి సీక్వెల్‌లో నటిస్తున్నారు.

వీటితో పాటు ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమైంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. స్వాతంత్రానికి ముందు జరిగే యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇమాన్వీ నటిస్తుందని కన్ఫార్మ్ చేశారు. పూజా కార్యక్రమంలో ఇమాన్వీతో ప్రభాస్‌ దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోందని తెలుస్తోంది. ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీలో వచ్చే హీరోయిన్‌ క్యారెక్టర్‌ కోసం సాయి పల్లవిని తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయిపల్లవి సైతం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది రాజా సాబ్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ చివరి స్టేజ్‌కు చేరుకున్న ఈ మూవీని ఈ ఏడాదిలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు కల్కి2, సలార్‌2, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ చిత్రాలతో ప్రభాస్‌ బిజీ బిజీగా ఉన్నారు. ఇవన్నీ పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలకానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories