Imanvi Esmail: ఓవర్‌ నైట్‌లో బ్యూటీ తలరాతే మారిపోయిందిగా.. అప్పుడే మొదలైన..

According to latest reports Iman Esmail got back to back chances
x

Imanvi Esmail: ఓవర్‌ నైట్‌లో బ్యూటీ తలరాతే మారిపోయిందిగా.. అప్పుడే మొదలైన.. 

Highlights

సీతారామం చిత్రంతో మృణాల్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన హను రాఘవపూడి, ఇప్పుడు మరో బ్యూటీని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

ఇమాన్వీ ఇస్మాయిల్‌... మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. అయితే ఒక్క ఫొటోతో ఈ బ్యూటీ తలరాతే మారిపోయింది. ఓవర్‌ నైట్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రభాస్‌, హనురాఘవపూడి దర్శకత్వలో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రభాస్‌కు జోడిగా.. ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు కేవలం యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు మాత్రమే పరిమితమైన ఈ బ్యూటీపై ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి పడింది.

సీతారామం చిత్రంతో మృణాల్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన హను రాఘవపూడి, ఇప్పుడు మరో బ్యూటీని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇటీవల సినిమా పూజా కార్యక్రమంలో ప్రభాస్‌తో దిగిన ఫొటోతో ఇమాన్వీ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఒక్కసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా లక్ష మంది ఫాలోవర్లు పెరిగిపోయారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్యూటీ గురించే చర్చ నడుస్తోంది. ఇంకా సినిమా షూటింగ్ కూడా ప్రాంరభమవ్వకముందే ఇమాన్వీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది.

బడ నిర్మాతాలు తమ తదుపరి చిత్రాల్లో హీరోయిన్‌గా ఇమాన్వీని తీసుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. అయితే ప్రభాస్‌తో సినిమా పూర్తయ్యేంత వరకు మరో సినిమాకు అంగీకరిచకూడదని దర్శకుడు హను రాఘవపూడి ఒక కండిషన్‌ పెట్టాడని సమాచారం. అంతేకాకుండా మైత్రీ మూవీ మేకర్స్‌ వరుసగా మూడు సినిమాలు తమ ప్రొడక్షన్‌ హౌజ్‌లోనే చేసేలా అగ్రీమెంట్ చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనా ఈ బ్యాటీ లైఫ్‌ మాత్రం ఒక్క రోజులోనే మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకా సినిమా షూటింగ్ కూడా మొదలవ్వకముందే.. ఇమాన్వీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తుండడంతో రాత్రికి రాత్రి ఈ బ్యూటీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. మరి ప్రభాస్‌ సినిమా తర్వాత ఇమాన్వీ క్రేజ్‌ ఎంతలా పెరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను స్వాతంత్రానికి ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన కాన్సెప్ట్ ఫొటో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories