అయన సినిమాలో అ పాత్రలు చిలకలుగానో, కోతులుగానో మారిపోయేవి...

అయన సినిమాలో అ పాత్రలు చిలకలుగానో, కోతులుగానో మారిపోయేవి...
x
Highlights

955 లో వచ్చిన కన్యాదానం సినిమా విఠలాచార్యకి గారికి మొదటి సినిమా ... అ సినిమాలోని ఓ పాత్ర కోసం కోసం విఠలాచార్య గారు సీనియర్ ఆర్టిస్టు సీఎస్‌ఆర్‌ను సంప్రదించారు .

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు మరియు నిర్మాత బి.విఠలాచార్యది ఓ ప్రత్యేకమైన స్థానం .. అప్పట్లో అయన సినిమాలు వెరైటీగా ఉండేవి .. అయన సినిమాలో కనిపించే చిత్ర, విచిత్రాలు మనకి మరే సినిమాలో కూడా కనిపించేవి కావు .. అయన సినిమాల్లో దయ్యాలు , అస్థిపంజరాలు , చిలకలు, కోతులు మొదలనవి కూడా ప్రేక్షకులను నవ్వించేవి ..ఆయన సినిమాల్లో "లాజిక్‌' అక్కర్లేదు, అరె అసలు 'అదెందుకు జరిగింది?' అని అడగడానికి లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే అయన సినిమాల ముఖ్య లక్షణం.

ఏదైనా సినిమా షూటింగ్ కి ఎవరైనా ఓక ఆర్టిస్టు మిస్ అయితే షూటింగ్ కి , సినిమాకి ఇబ్బంది అవుతుంది. కానీ విఠలాచార్యకి మాత్రం అలాంటి భయాలు ఏమి ఉండేవి కాదట .. అలాంటి సందర్భంలో అయన అప్పటికప్పుడు ఓ సన్నివేశాన్ని మర్చి , ఓ పాత్రను సృష్టించి సినిమాని అనుకున్న విధంగా, అనుకున్న టైంకి తెరకెక్కించే వారు ..నటీనటుల కాల్‌ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లిందని ఒక సందర్భంలో కాంతారావు చెప్పారు.. ఉదాహరణకి జగన్మోహిని చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది . అందులో కొరివి దెయ్యాలు పొయ్యిలో కాళ్లు పెట్టి వంట చేయడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఎంత నవ్వించాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ... నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రయోగాల వల్లే విఠలాచార్య గారు దర్శకుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచారు ..

1955 లో వచ్చిన కన్యాదానం సినిమా విఠలాచార్యకి మొదటి సినిమా ... అ సినిమాలోని ఓ పాత్ర కోసం కోసం విఠలాచార్య సీనియర్ ఆర్టిస్టు సీఎస్‌ఆర్‌ను సంప్రదించారు . మూడు రోజులు వేషానికి గాను ఐదు వెయిల రూపాయలు ఇస్తానని చెప్పుకొచ్చారట . ఇప్పుడు మూడు రోజులని చెప్పి అ తర్వాత రోజులు పెంచుతారని ఇలా కాదు కానీ రోజులు వేయి రూపాయలు ఇస్తే వేషానికి సిద్దమని సీఎస్‌ఆర్‌ చెప్పారట .. ఇక విఠలాచార్య సినిమాలోని అయన పాత్రను అనుకున్నట్టుగానే మూడు రోజుల్లో పూర్తి చేయడంతో సీఎస్‌ఆర్‌ ఆశ్చర్యపోయారట .. కానీ ముందుగా అనుకునట్టుగానే విఠలాచార్య సీఎస్‌ఆర్‌ కి ఐదు వెయిల రూపాయలు ఇచ్చి మరింత ఆశ్చర్యానికి గురిచేసారట .. !

విఠలాచార్య ఎంతో బాధ్యత గల నిర్మాత కూడా . నటీనటులకీ, టెక్లీషియన్లకీ తాను ఇస్తానన్న మొత్తాన్ని విభజించి ప్రతినెలా ఒకటో తేదీకల్లా - చిన్నా, పెద్దా అందరికీ చెక్కులు పంపించేసేవారు. ఏది వచ్చినా రాకపోయినా విఠలాచార్య గారి చెక్కు వచ్చేస్తుందన్న నమ్మకం అందరికీ వుండేది. ఈ విధానం అరుదు! అలాగే నటీనటులకి కాల్‌ షీట్స్‌ అడ్జస్ట్‌ చెయ్యడంలో కూడా ఆయన 'నంబర్‌వన్‌' అనిపించుకునేవారు. ఇక సినిమాని కూడా అనుకున్న తేదీకి విడుదల చెయ్యడం కూడా ఆయనకే చెల్లింది. సినిమా ఆరంభించకముందే - విడుదల తేదీ ఇవ్వడం ఎంతమందికి సాధ్యం చెప్పండి సినిమా పరిశ్రమలో ఇదికూడా ఓ అరుదే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories