రానా తమ్ముడి సినిమాకి ముహూర్తం ఖరారు

Abhiram Daggubati First Film is About to Release
x

రానా తమ్ముడి సినిమాకి ముహూర్తం ఖరారు

Highlights

*అభిరామ్ దగ్గుబాటి మొదటి సినిమా అప్పుడే విడుదలవుతుందట

Tollywood: ఇప్పటికే ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా మారిన చాలామంది టాలీవుడ్ లో మంచి పేరు సంపాదిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో చేరడానికి సిద్ధమవుతున్నారు అభిరామ్ దగ్గుబాటి. స్టార్ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు రెండవ తనయుడిగా ప్రముఖ హీరో రానా దగ్గుబాటి తమ్ముడిగా అభిరామ్ దగ్గుబాటి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోగా మారబోతున్నారు. గత కొంతకాలంగా అభిరామ్ హీరోగా తన కెరియర్ ను మొదలు పెట్టబోతున్నాడు అని బోలెడు పుకార్లు వినిపించాయి కానీ అదే సమయంలో శ్రీరెడ్డి వివాదాల వల్ల కొన్నాళ్లపాటు మీడియా నుంచి అజ్ఞాతవాసం చేశారు అభిరామ్.

తాజాగా ఇప్పుడు అభిరామ్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక అభిరామ్ మొదటి సినిమా అయిన "అహింస" కి ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇక త్వరలోనే సినిమాకి సంబంధించిన విడుదల తేదీని దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్పి పట్నాయక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. "లీడర్" సినిమాతో హీరోగా మారి "బాహుబలి" తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రానా దగ్గుబాటి ఇటు టాలీవుడ్ లో మాత్రమే కాక అటు బాలీవుడ్ లో కూడా తనదైన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మరి అదే కుటుంబం నుంచి హీరోగా మారనున్న అభిరామ్ హీరోగా ఎంతవరకు మంచి మార్కులు వేయించుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories