AAY OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఆయ్‌'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి, ఎందులో..

AAY Movie OTT streaming in Netflix from september 12th
x

AAY OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఆయ్‌'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి, ఎందులో.. 

Highlights

ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్, న‌య‌న్ సారిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

కథ బాగుంటే చిన్న బడ్జెట్‌ చిత్రాలు సైతం మంచి విజయాన్ని అందుకుంటాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ జాబితాలోకి వస్తుంది తాజాగా విడుదలైన 'ఆయ్‌' మూవీ. గీతా ఆర్ట్స్‌2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాణంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్, న‌య‌న్ సారిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంజి కంచిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను బాగా మెప్పించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా రాబట్టింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా సెప్టెంబర్‌ 12వ తేదీన తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ఎక్స్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇక 'ఆయ్‌' సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటాడు కార్తీక్ (నార్నె నితిన్). క‌రోనా వ‌ల‌న లాక్ డౌన్ రావ‌డంతో త‌న సోంతఊరు అయిన అమ‌లాపురం వ‌స్తాడు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకుంటూ చిన్న నాటి ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతుంటాడు. అదే సమయంలో ఊరిలో ఉన్న పల్లవి (నయన్ సారిక)ని చూసి ఫ‌స్ట్ లుక్‌లోనే ప్రేమలో పడతాడు. పల్లవికి కులం పట్టింపు ఎక్కువగా ఉంటుంది. అయితే కార్తీక్‌ తన కులం వాడే అనుకుని ల‌వ్ చేస్తుంది. అయితే కార్తీక్ కులం వేర‌ని తెలిసిన ప‌ల్ల‌వి తన తండ్రి (మైమ్ గోపి) అత‌డిని చంపేస్తాడని దూరం పెడుతుంది. ఈ క్ర‌మంలో కార్తీక్ ఏం చేస్తాడు. ప‌ల్లవి, కార్తీక్‌ల ప్రేమ‌ను ప‌ల్లవి తండ్రి ఒప్పుకుంటాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories