Aamir Khan: కొత్త ఇంటికి ఆమీర్ ఖాన్.. అద్దె నెలకు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

Aamir Khan: కొత్త ఇంటికి ఆమీర్ ఖాన్.. అద్దె నెలకు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే
x

Aamir Khan: కొత్త ఇంటికి ఆమీర్ ఖాన్.. అద్దె నెలకు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

Highlights

Aamir Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కొత్త ఇల్లు కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నెలకు ఏకంగా రూ. 24.5 లక్షల అద్దెతో ఒక లగ్జరీ ఇంటిని తీసుకున్నారు.

Aamir Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కొత్త ఇల్లు కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నెలకు ఏకంగా రూ. 24.5 లక్షల అద్దెతో ఒక లగ్జరీ ఇంటిని తీసుకున్నారు. ఆయన సొంత ఇల్లు అయిన విర్గో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున, తాత్కాలికంగా ఈ కొత్త ఇంట్లోకి మారారు. ఈ భారీ అద్దెకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమిర్ ఖాన్ తీసుకున్న ఈ కొత్త ఇల్లు ముంబైలోని బాంద్రా వెస్ట్, పాలి హిల్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం చాలా ఖరీదైనది. ఈ ఇంటి అద్దె నెలకు రూ. 24.5 లక్షలు. దీని ప్రకారం, ఆయన ప్రతి నాలుగు నెలలకు కోటి రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇంటి కోసం ఆయన ఏకంగా ఐదేళ్ల లీజ్ ఒప్పందం చేసుకున్నారు. అంటే, మే 2025 నుండి 2030 వరకు ఈ ఇంట్లోనే ఉంటారు. ఈ లీజ్ ఒప్పందం కోసం ఆమిర్ ఖాన్ రూ. 4 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 1.46 కోట్ల డిపాజిట్ చెల్లించారు. ఈ ఒప్పందం ప్రకారం, అద్దె ప్రతి ఏటా 5% పెరుగుతుంది.

లగ్జరీ సముద్ర తీర నివాసం

ఆమిర్ ఖాన్ తాత్కాలికంగా మారిన ఈ కొత్త ఇల్లు సముద్రం వైపు చూసేలా, చాలా లగ్జరీగా ఉందని సమాచారం. ఆయన ప్రస్తుతం ఉన్న విర్గో సొసైటీలో 12 అపార్ట్‌మెంట్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆ ఇల్లు ప్రస్తుతం మరమ్మత్తుల కోసం ఖాళీ చేయడంతో, ఈ కొత్త అద్దె ఇంటికి మారారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షారుఖ్ ఖాన్ కూడా ఇటీవల ఒక తాత్కాలిక ఇంటిని తీసుకున్నారు. అది ఆమిర్ ఇంటికి కేవలం 750 మీటర్ల దూరంలోనే ఉంది. ఆమిర్ ఖాన్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం 'సితారే జమీన్ పర్' అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అందరి ప్రశంసలు పొందింది. ఈ సినిమాను యూట్యూబ్‌లో రూ. 100కు వీక్షించే అవకాశం కల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories