కరోనాపై చైనా అభిమానుల కోసం హీరో స్పెషల్ వీడియో

కరోనాపై చైనా అభిమానుల కోసం హీరో స్పెషల్ వీడియో
x
Ameer Khan Video
Highlights

కొవిడ్-19(కరోనా) వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కబళించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా చైనాలో ఎంతోమంది మృత్యువాత పడిన పడ్డారు.

కొవిడ్-19(కరోనా) వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కబళించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా చైనాలో ఎంతోమంది మృత్యువాత పడిన పడ్డారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కరోనా వైరస్‌పట్ల చైనా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతూ బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ ఓ స్పెషల్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ.. కరోనా వైరస్‌ గురించి ఓ ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ వీడియో అమీర్ ఖాన్ 'చైనాలోని నా మిత్రులందరికి హాయ్‌. కరోనా వైరస్‌ చైనాలో విజృంభిస్తున్న విషయం గురించి విని నేనెంతో విచారానికి గురయ్యాను. నా స్నేహితులు చైనాలోని పరిస్థితుల గురించి చెబుతుంటే విని నా హృదయం తరుక్కుపోయింది. కరోనా వైరస్ కారణంగా తమ బంధువులను, మిత్రులను, కుంటుంబ సభ్యులను కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

నాకు తెలుసు ఇక ఇది అత్యంత క్లిష్టమైన సమయం. అధికార యంత్రాంగం అక్కడ మళ్లీ సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది. కాబట్టి అక్కడి వారందరూ ఈ సమయంలో కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండటంతోపాటు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చైనాలో త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నా ప్రార్థనలు మీ వెంటే ఉంటాయి. అందరూ జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉండండి అని ఆమీర్‌ఖాన్‌ వీడియోలో తెలిపారు. కాగా.. ఆమీర్ ఖాన్ 'త్రీఇడియట్స్‌', 'దంగల్‌' చిత్రాలతో ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చైనాలోను దంగల్ చిత్రం తర్వాత ఆయనకు అభిమానులు పెరిపోయారు. దీంతో చైనా వారికోసం ప్రత్యేకంగా వీడియో ద్వారా తన సానుభూతి ప్రకటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories