Aamir Khan: 60 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ ఆమిర్ ఖాన్.. ఇంతకీ ఎవరీ గౌరీ స్రాట్‌.?

Aamir Khan Confirms Relationship at 60 Who is Gauri Spratt All About His New Girlfriend
x

Aamir Khan: 60 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ ఆమిర్ ఖాన్.. ఇంతకీ ఎవరీ గౌరీ స్రాట్‌.?

Highlights

Aamir Khan: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Aamir Khan: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గురువారం రోజున తన 60వ పుట్టిన రోజు సందర్భంగా అమీర్‌ కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో, ఓ కీలక విషయాన్ని స్వయంగా వెల్లడించారు. గత ఏడాదిన్నరగా గౌరీ స్ప్రాట్ అనే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్టు ప్రకటించారు. కేక్ కట్ చేసిన తర్వాత ఆమెను మీడియాకు పరిచయం చేశారు. దీంతో గౌరీ స్ప్రాట్‌ ఎవరు? అనే విషయంపై నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఈమె ఎవరు.? బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసకుందాం.

గౌరీ ప్రస్తుతం ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థలో పని చేస్తోంది. బెంగళూరులో నివసించే గౌరీ, స్టైలిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన రీటా స్ప్రాట్ కుమార్తె. ఆమె తల్లి తమిళియన్ కాగా, తండ్రి ఐరిష్‌. బ్లూ మౌంటెన్ స్కూల్‌ చదువుకున్న గౌరీ, తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో స్పెషలైజ్ చేసింది. లండన్ యూనివర్సిటీలో స్టైలింగ్, ఫోటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. గతంలో గౌరీకి ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. తర్వాత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె కుమారుడితో కలిసి జీవిస్తోంది.

25 ఏళ్ల స్నేహం, ప్రేమలోకి మారింది:

గౌరీ – ఆమిర్ మధ్య స్నేహం కొత్తది కాదు. వీరి స్నేహం దాదాపు 25 ఏళ్లనుండి కొనసాగుతోంది. గత 18 నెలలుగా ఆ స్నేహం ప్రేమగా మారిందని ఆమిర్ వెల్లడించారు. ఇప్పటికే ఇరు కుటుంబాలూ ఈ బంధానికి అంగీకారం తెలుపాయని చెప్పారు. ఇటీవల జరిగిన ప్రీ బర్త్‌డే వేడుకలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కి గౌరీని పరిచయం చేసిన విషయాన్ని కూడా వివరించారు. గౌరీ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటుందని, ఆమెను కలవడం కోసం తానే అక్కడికి తరచూ వెళ్లేవాడినని ఆమిర్ తెలిపారు.

మీడియా దృష్టిలో పడకుండా తమ రిలేషన్‌ కొనసాగించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. గౌరీ హిందీ సినిమాలను ఎక్కువగా చూడదని, తన సినిమాల్లో ‘లగాన్’, ‘దంగల్’, ‘దిల్ చాహ్తా హై’ మాత్రమే చూసిందని తెలిపారు. పాటలు పాడటం తనకు ఇష్టమని, గౌరీ కోసం తరచూ పాటలు పాడుతుంటానని చెప్పుకొచ్చారు. ప్రేయసి గౌరీకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. డేటింగ్ విషయాన్ని అధికారికంగా వెల్లడించకముందే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నది ఆమిర్ మాటల్లో తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories