అల్లు అర్జున్‌ ఇంటికి అమీర్‌ ఖాన్‌.. ఇంతకీ ఏంటో స్పెషల్‌..?

Aamir Khan Came To Allu Arjuns House
x

అల్లు అర్జున్‌ ఇంటికి అమీర్‌ ఖాన్‌.. ఇంతకీ ఏంటో స్పెషల్‌..?

Highlights

* మహాభారతం గురించి అల్లు అరవింద్ తో డిస్కషన్లు జరుపుతున్న అమీర్ ఖాన్

Mahabharatham Movie: ఈ మధ్యనే ఎయిర్పోర్టులో అల్లు అర్జున్ కి చెందిన ఒక పెద్ద బ్లాక్ రేంజ్ రోవర్ కార్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని పిక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్పోర్టులో కనిపించిన ఆ కారు మళ్లీ జూబ్లీహిల్స్ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు ప్రత్యక్షమైంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గీత ఆర్ట్స్ ఆఫీస్ కి విచ్చేసినట్లు తెలుస్తోంది.

"లాల్ సింగ్ చద్దా" సినిమాతో డిజాస్టర్ అందుకున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం టి సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ బయోపిక్ తో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు అమీర్ ఖాన్ మరియు గీత ఆర్ట్స్ తో సంయుక్తంగా టి సిరీస్ ఒక భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ లో "మహాభారత" సినిమా రాబోతోంది అని తెలుస్తోంది. గీత ఆర్ట్స్ వారు స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

గతంలో గీత ఆర్ట్స్ "మహాభారతం" ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని స్కెచెస్ కూడా విడుదల చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొలాబరేషన్ తో ఈ ప్రాజెక్టు విడుదల కాబోతోంది. ఈ ప్రాజెక్టులో తాము కూడా భాగం అవ్వడానికే ఆమిర్ ఖాన్ మరియు టి సిరీస్ వారు ప్రయత్నిస్తున్నారని అందుకే అల్లు అరవింద్ ని కలిసి దీనికి సంబంధించిన డిస్కషన్లు కూడా చేశారని, ఈ ప్రాజెక్టు కి సహనిర్మాత అయిన అల్లు అర్జున్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories