Aadi Saikumar: రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్..!

Aadi Saikumar: రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్..!
x

Aadi Saikumar: రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్..!

Highlights

శంబాల హిట్‌తో ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ రెండోసారి తండ్రిగా మారారు. ఆది భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇంట్లో సంతోషాలు రెట్టింపయ్యాయి. ఇటీవల ‘శంబాల’ సినిమాతో కెరీర్‌లో కీలక హిట్ అందుకున్న ఆది, తాజాగా రెండోసారి తండ్రిగా మారాడు. ఆది భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.

ఆది సాయి కుమార్ 2014 డిసెంబరులో రాజమండ్రికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరుణను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే ఒక కూతురు ఉంది. తాజాగా రెండో బిడ్డగా కుమారుడు పుట్టడంతో ఆది కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సినీ, రాజకీయ, సెలబ్రిటీ వర్గాల నుంచి ఆది దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఆది సాయి కుమార్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. 2011లో ‘ప్రేమ కావాలి’ సినిమాతో హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘లవ్లీ’, ‘సుకుమారుడు’, ‘గలిపటం’, ‘గరం’, ‘శమంతకమణి’, ‘బ్లాక్’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి చిత్రాల్లో నటించారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూసిన ఆది, ఇటీవల విడుదలైన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’తో భారీ విజయం అందుకున్నారు.

సినీ కెరీర్‌లో హిట్ అందుకున్న సమయానికే వ్యక్తిగత జీవితంలో కూడా ఈ శుభవార్త రావడంతో, ఆది అభిమానులు డబుల్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories