logo
సినిమా

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ... హిట్టా..? ఫట్టా..?

Aadavallu Meeku Johaarlu Movie Genuine Review | Sharwanand | Rashmika Mandanna
X

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ... హిట్టా..? ఫట్టా..?

Highlights

Aadavallu Meeku Johaarlu: నిజానికి సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది... కానీ...

Aadavallu Meeku Johaarlu:

చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు

నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ, రవిశంకర్, ప్రదీప్ రావత్, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం: కిషోర్ తిరుమల

బ్యానర్: ఎస్ ఎల్ వీ సినిమాస్

విడుదల తేది: 04/03/2021

ఈ మధ్యనే "మహాసముద్రం" సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వానంద్ తాజాగా ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే ఒక రొమాంటిక్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ వంటి సీనియర్ నటీమణులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. టీజర్ మరియు ట్రైలర్ లతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సింది కాస్త వాయిదా పడి ఇవాళ అనగా మార్చి 4, 2022 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూసేద్దామా..

కథ:

చిరు (శర్వానంద్) కుటుంబంలో పది మంది ఆడవాళ్ళు ఉంటారు. దీంతో వాళ్ల అందరికీ నచ్చే అమ్మాయి దొరకక చిరు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసిన అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. చివరికి చిరు ఒకరోజు ఆధ్యా (రష్మిక మందన్న) ని కలుస్తాడు. నెమ్మదిగా చిరుకి ఆమెపై ప్రేమ మొదలవుతుంది. ఆద్య కి కూడా చిరు మరియు తన మంచితనం బాగా నచ్చుతుంది. కానీ ఇప్పటికే చాలామంది పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోవడంతో చిరు తనకున్న ప్రేమని చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. కానీ ఒకసారి అనుకోకుండా తన ప్రేమ విషయాన్ని అధ్య తో చెప్పేస్తాడు. ఆద్య ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రేమని ఒప్పుకుందా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

శర్వానంద్ నటన ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. చుట్టూ చాలా మంది సీనియర్ నటులు ఉన్నప్పటికీ శర్వానంద్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. రష్మిక మందన్న నటన కూడా ఈ సినిమాలో చాలా బాగా అనిపిస్తుంది. పుష్ప సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించిన రష్మిక ఈ సినిమాలో స్టైలిష్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. రాధిక శరత్కుమార్, ఊర్వశి, కుష్బూ పాత్రలు సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. వారి అద్భుతమైన నటన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్సయింది. వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమా కోసం ఒక మంచి స్క్రిప్ట్ ను ఎంటర్టైన్మెంట్ తో నిండిన స్క్రిప్ట్ ను ఎంచుకున్నారు వీలైనంతవరకూ ఊ ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్స్ ని సమపాళ్ళలో పెట్టాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది అయితే అన్ని ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి బాగానే వర్కౌట్ అయినప్పటికీ ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ నవ్వలేక పోతారు ఫస్టాఫ్ చాలా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కొంచెం కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది ఒకటి రెండు పాటలు చాలా బాగుంది అప్పటికీ నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది సుజిత్ సారంగ్ కలర్ఫుల్ విజువల్స్ చాలా బాగున్నాయి ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది

బలాలు:

నటీనటులు

ఫస్ట్ హాఫ్

కామెడీ సన్నివేశాలు

డైలాగులు

బలహీనతలు:

డ్రామా ఎక్కువగా ఉండటం

ఎమోషనల్ సన్నివేశాలు ప్రెడిక్టబుల్ గా అనిపించటం

కథలో కొత్తదనం లేకపోవడం

క్లైమాక్స్

చివరి మాట:

నిజానికి సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్టాఫ్ మొత్తం కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ తో బాగానే సాగుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. అయితే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ను తగ్గించి కేవలం ఎమోషన్ లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ మెలోడ్రామా బాగా ఎక్కువగా అయిపోవడంతో సినిమా ఒక సీరియల్ లాగా అనిపిస్తుంది. వెంకటేష్ మెంట్ బాగానే ఉన్నప్పటికీ చాలా వరకు సన్నివేశాలలో ప్రేక్షకులు కథతో అంతా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు.

బాటమ్ లైన్:

"ఆడవాళ్లు మీకు జోహార్లు" ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా.

Web TitleAadavallu Meeku Johaarlu Movie Genuine Review | Sharwanand | Rashmika Mandanna
Next Story