AA23 Update: అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్.. పెద్ద ప్లానింగే!

AA23 Update
x

AA23 Update: అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్.. పెద్ద ప్లానింగే!

Highlights

AA23 Update: ఐకాన్ స్టార్' అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'AA23'గా ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

AA23 Update: ఐకాన్ స్టార్' అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'AA23'గా ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక లోకేష్ కనగరాజ్ సినిమాలో అల్లు అర్జున్ నటించనున్నారు. మెగా ప్రాజెక్ట్‌పై ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

AA23 చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఫిమేల్ లీడ్‌గా నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, శ్రద్దా ఆసక్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే నిజమైతే 'స్త్రీ 2' వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రద్ధా.. తొలిసారిగా అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. AA23 లో శ్రద్ద పాత్ర కథకు కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్‌కు ఇది టాలీవుడ్‌లో రెండో అవకాశం కానుంది. ఆమె గతంలో ప్రభాస్ సరసన నటించిన ‘సాహో’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు AA23 లాంటి భారీ ప్రాజెక్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పనిచేయనున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌ను అభిమానులు ‘పాన్ ఇండియా బ్లాస్ట్’గా అభివర్ణిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే AA23 చిత్రాన్ని 2027లో వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, ఈ బజ్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ కాంబోకు శ్రద్ధా కపూర్ జతకలిస్తే.. ఇండస్ట్రీని షేక్ చేసే మెగా ప్రాజెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories