Allu Arjun -Trivikram: మరోసారి రిపీట్‌ కానున్న క్రేజీ కాంబో.. అధికారిక ప్రకటన..!

Allu Arjun -Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

Arun Chilukuri
Published on: 3 July 2023 12:01 PM IST
AA22 Allu Arjun, Trivikram to Reunite for Fourth Film
X

Allu Arjun -Trivikram: మరోసారి రిపీట్‌ కానున్న క్రేజీ కాంబో.. అధికారిక ప్రకటన..!

Allu Arjun -Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఆ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. తాజాగా ఇప్పుడు ఈ కాంబోలో నాలుగవ సినిమా కూడా పట్టాలెక్కబోతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈసారి రెట్టింపు వినోదంతో రానున్నారని తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

నేడు (జులై 3)న ఉదయం 10 గంటల 8 ని.లకు వీడియో ద్వారా వారు మూవీకి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుందని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story