Top
logo

యాంకర్ ప్రదీప్‌ పై కేసు నమోదు

యాంకర్ ప్రదీప్‌ పై కేసు నమోదు
Highlights

బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ప్రదీప్...

బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ప్రదీప్ హీరోగా ౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, ఇది నిబంధనలకి విరుద్దమని, ఈ సినిమా షూటింగ్ వెంటనే ఆపేయాలని యాంకర్ ప్రదీప్‌ పై మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన శ్రీరామోజు సునిశిత్‌ అనే దర్శకుడు పోలీస్ స్టేషన్ లో దాఖలు చేశాడు. ప్రస్తుతం పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు..

ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను యంగ్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేయగా, మొదటిపాటను మహేష్ బాబు రిలీజ్ చేశారు. పల్లెటూరు యువకుడు, యువతీగా ప్రదీప్‌ , అమృత అయ్యర్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ దగ్గర ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయన ఈ సినిమాకు కథ మాటలు కూడా అందిస్తున్నాడు. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. బాబు సినిమాని నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Web TitleA director case file against anchor pradeep
Next Story


లైవ్ టీవి