బుడతడే కానీ క్రికెట్ ఆటలో ఘనుడు...

cricket child
x
cricket child
Highlights

సహజంగా అయితే క్రికెట్ ఆట మనకి ఓ పదేళ్ళకి తెలుస్తుంది. పక్కన వాళ్ళు ఆడుతుంటే చూసి నేర్చుకొని కొన్ని రోజుల తర్వాత ఆడడం స్టార్ట్ చేస్తాం.. కానీ ఈ బుడతడు...

సహజంగా అయితే క్రికెట్ ఆట మనకి ఓ పదేళ్ళకి తెలుస్తుంది. పక్కన వాళ్ళు ఆడుతుంటే చూసి నేర్చుకొని కొన్ని రోజుల తర్వాత ఆడడం స్టార్ట్ చేస్తాం.. కానీ ఈ బుడతడు మాత్రం ఇంకా డైపర్స్‌లోనే ఉన్నాడు కానీ అప్పుడే ఆటను మడత పెట్టేస్తున్నాడు... ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా ఆడుతున్నాడు. బంతిని అంచనా వేయడం నుండి ఆ బంతిని చూడ చక్కని షాట్లతో బౌండరీలకు తరలించే వరకు చాలా అద్భుతంగా కొట్టేస్తున్నాడు...

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా ఈ వీడియోని చూసి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్‌ వాన్‌ కూడా షాక్ అయ్యాడు. బహుశా ఈ బుడతడు ఇంగ్లాండ్ గడ్డపై పుట్టే ఉంటాడని స్పందించాడు. ఇక వీడియోకి గాను నెటిజన్లు కూడా ఫీదా అవుతున్నారు. బుడతడే కానీ ఆటలో ఘనుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories