ఓటీటీలో అన‌న్య నాగ‌ళ్ల‌ 'Play Back'..ఏఆర్ రెహ‌మాన్ '99 సాంగ్స్‌'

99 songs and Playback Starts Streaming On OTT
x

99 songs and Playback

Highlights

99 songs and Playback: ఇక తాజాగా ఓటీటీ వేదిక‌పై ‘99 సాంగ్స్‌’, ప్లే బ్యాక్ చిత్రాలు విడుద‌ల అయ్యాయి.

99 songs and PlayBack: క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. ఇక సినీ ఇండ‌స్ట్రీపై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి. 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో సినిమాలు అన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి. ఈ ఏడాది మొద‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌డంతో సినిమాల‌ రిలీజులు ఊపందుకున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గ‌డ్డుప‌రిస్థితులు వ‌చ్చాయి. మ‌ళ్లీ థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీనే ప్ర‌త్యామ్న‌యంగా క‌నిపించింది. దీంతో ఓటీటీల్లో ప‌లు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక తాజాగా ఓటీటీ వేదిక‌పై '99 సాంగ్స్‌', ప్లే బ్యాక్ చిత్రాలు విడుద‌ల అయ్యాయి.

ఇహాన్‌ భట్‌, ఎడిల్సీ, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలతో విశ్వేష్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం '99 సాంగ్స్‌'. సంగీతం, ప్రేమ‌ నేప‌థ్యంలో సాగుతుంది ఈ సినిమా. ప్రముఖ‌ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ నిర్మించారు. ఏప్రిల్ 16న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 21 నుంచి హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని తెలియజేస్తూ.. కొత్త ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం.

టైమ్ ట్రావ‌ల‌ర్ మూమీ ప్లే బ్యాక్..గతాన్ని వర్తమానాన్ని లింక్ చేస్తూ చేసిన ప్రయోగం చేశారు. టాలీవుడ్ లో కొత్త ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా తెర‌కెక్కింది. వ‌కీల్ సాబ్ ఫేమ్ అన‌న్య నాగ‌ళ్ల‌, దినేష్ తేజ ప్ర‌ధాన పాత్ర‌ల్లో హ‌రిప్ర‌సాద్ జ‌క్కా రూపొందించిన చిత్రం ప్లే బ్యాక్.. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రసాద్రావు పెద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించారుఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందించారు. మే 21 నుంచి ఈ సస్పెన్స్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.. ఒక్క కాల్ హీరోను 1993లో ఉన్న హీరోయిన్ దగ్గరకు ఎలా తీసుకెళ్ళింది? తర్వాత ఏం జరిగింది? అనే అనుమానాలు రేకెత్తిస్తున్న టీజర్ ఆసక్తికరంగా ఉంది. అర్జున్ కళ్యాణ్, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, కార్తికేయ కృష్ణ మల్లాడి, మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, తాగుబోతు రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు తదితరులు నటిస్తున్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories