90ML మూవీ రివ్యూ

90ML మూవీ రివ్యూ
x
Highlights

ఎట్టకేలకు వాయిదా పడి ఈ శుక్రవారం 90ML చిత్రం ప్రక్షకుల ముందుకు వచ్చింది.

ఎట్టకేలకు వాయిదా పడి ఈ శుక్రవారం 90 ML చిత్రం ప్రక్షకుల ముందుకు వచ్చింది. కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా పై ప్రేక్షకులకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ:

దేవదాసు (కార్తికేయ) పుట్టడమే ఫేటల్ ఆల్కహాలిక్ డిజస్టర్‌తో జన్మిస్తాడు. దేవదాసు తరచూ ఆల్కహాల్‌కి రియాక్ట్ కావడంతో వైద్యులు అతనికి రోజు ఆల్కహాల్ డ్రింకర్ సర్టిఫికెట్ ఇస్తారు.‎ దేవదాసుకి రోజు 90ఏంఎల్ తాగాల్సి ఉంటుంది. ఒక రోజుకు తాగపోయిన అతని ప్రాణాలకే ప్రమాదం. అలాంటిది అతను సువాసన(నేహా సోలంకి)ని చూసిన మొదటి క్షణానే ప్రేమలో పడతాడు. కానీ, సుహసనికి వాళ్ల కుటుంబానికి చెడు అలవాట్లు ఉన్నవారు నచ్చరు. దేవదాసు విషయం తెలియక 90 ML అతనితో ప్రేమలో పడుతుంది సుహసన. కానీ, అతని విషయం తెలుసున్న సువాసన, దేవదాసు ప్రేమకు బ్రేక్ అప్ చెబుతుంది. అంతకుముందు దేవదాసు కొట్టి విలన్లు అతని ప్రేమకు అడ్డు తగులుతుంటారు. ఇంతకి దేవదాసు తన సమస్య బారి నుంచి పయటపడతాడా? సువాసన ప్రేమను గెలుస్తాడా?

సాంకేతికంగా..

ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడే సినిమా గురించి మొత్తం డైరెక్టర్ చెప్పేశారు. 90 ML అనే ఓ కొత్త లైన్ తో చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు ఇండస్ట్రీకి మొదటి సారి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ రెడ్డి, కమర్షియల్ ఫార్మాలని జోడిచిండంలో బాగా సక్సెస్ అయ్యారనేది సినిమా మొదట్లోనే తెలుస్తుంది. కమర్షియల్ ఫార్మాట్ ప్రకారం ఓ సాంగ్, ఓ ఫైట్, ఒక లవ్ సీన్ అంటూ నడిపించారు.

ప్రధమార్థం వరకు కిక్ ఇస్తూ బ్రేక్ లేకుండా నడిచింది. హీరో, హీరోయిన్ లవ్ బ్రేక్ అనే పాయింట్ తో ఇంటర్వెల్ సీన్ వస్తుంది. సినిమా ద్వితీయార్ధంలో కాస్త తడబడ్డారు. సెకండ్ హాఫ్‌లో హీరోని మందు మాన్పించడానికి చేసిన ప్రయత్నాలు ముందే ఊహించిన వాటిలానే ఉన్నాయి. ఫస్టాఫ్‌లో కామెడీ పండిచించారు. సెకండాఫ్‌కి వచ్చేసరికి కామెడీ తేలిపోయింది. దాంతో కిక్ తగ్గిపోయింది.

ఇక మెయిన్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ అంశంపై కాస్త ఫోకస్ పెట్టి ఉంటే సరిపోయేది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి సినిమాని ఎండ్ సిట్యుయేషన్ సింగ్ కాలేదనే చెప్పాలి. రోటీన్ క్లైమాక్స్ ఉండడంతో కొత్తగా ఏమీ లేదు. ఈ సినిమాని కార్తికేయ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన మంచి నటన కనబరిచారు. హీరోయిన్ నేహా సోలంకి నటనతో ఆకట్టుకుంది. రోలర్స్ రఘు హస్యం ఈ సినిమాలో బాగానే ఉంది.

అనూప్ అందించిన మూడు పాటలు ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సీన్స్‌లో విజువల్ కంటెంట్‌ని బాగా చూపించారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మణ విలువలు ప్లాస్ అయ్యయి. మొత్తానికి ఒ మంచి కమర్షియల్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారంతో వచ్చే కలెక్షన్స్ పై ఈసినిమా ఆధారాపడి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories