DJ Tillu Movie: 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు

9 Crore Pre-Release Business of DJ Tillu Movie | Tollywood News
x

DJ Tillu Movie: 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు

Highlights

DJ Tillu Movie: భారీ బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సిద్దు జొన్నలగడ్డ సినిమా

DJ Tillu Movie: యువ హీరో సిద్దు జొన్నలగడ్డ "కృష్ణ అండ్ హిజ్ లీల" సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా "మా వింత గాధ వినుమా" అనే సినిమా లతో అందరి దృష్టిని ఆకర్షించిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు "డీజే టిల్లు" అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి ఒక రోజు ముందు అంటే ఫిబ్రవరి 11న మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. డిజె టిల్లు హిట్ అవ్వాలంటే 9 కోట్లు బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలి. మరి ఈ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ ఎంతవరకు ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

"డిజే టిల్లు" వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్:

నైజాం: 2.5 కోట్లు

సీడెడ్: 1.5 కోట్లు

ఉత్తర ఆంధ్ర: 0.8 కోట్లు

గుంటూరు: 0.55 కోట్లు

ఈస్ట్ గోదావరి: 0.48 కోట్లు

వెస్ట్ గోదావరి: 0.4 కోట్లు

కృష్ణ: 0.45 కోట్లు

నెల్లూరు: 0.3 కోట్లు

ఆంధ్ర+తెలంగాణ: 6.98 కోట్లు

వరల్డ్ వైడ్: 8.98 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories