ఘనంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ : గల్లీ బోయ్ చిత్రానికి ఏకంగా 13 అవార్డులు

ఘనంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ : గల్లీ బోయ్ చిత్రానికి ఏకంగా 13 అవార్డులు
x
Highlights

ప్రతి ఏడాది నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రతి ఏడాది నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ ఏడాది జరిగిన 65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలను 2019లో బాలీవుడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు ప్రధానం చేశారు. దీనికి అసోంలోని గువాహటిలో ఉన్న ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియం వేదికైంది. దీనికి సినీ తారాలు అందరు విచ్చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి నిర్మాత కరణ్ జోహార్, నటుడు విక్కీ కౌశల్ వాఖ్యతలు వ్యవహరించారు.

అయితే ఇందులో అత్యధికంగా 'గల్లీ బోయ్' చిత్రానికి గాను ఏకంగా 13 అవార్డులను వరించాయి. ఉత్తమ నటుడుగా రణ్‌వీర్ సింగ్, ఉత్తమ నటిగా ఆలియా, ఉత్తమ దర్శకురాలుగా జోయా అక్తర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 'సాంధ్ కి ఆంఖ్' చిత్రానికి గాను తాప్సి, భూమి పెడ్నేకర్ సంయుక్తంగా ఉత్తమ నటి (విమర్శకులు) పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వేడుకలో సీనియర్ నటుడు గోవిందకు ఎక్స్‌లెన్స్ అవార్డును అందజేశారు. అంతేకాకుండా 'షోలే' చిత్ర దర్శకుడు రమేష్ సిప్పీని జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విజేతలు వీరే..

ఉత్తమ నటుడు - రణ్‌వీర్ సింగ్

♦ ఉత్తమ నటి - ఆలియా భట్

♦ ఉత్తమ చిత్రం - గల్లీ బోయ్

♦ బెస్ట్ డైరెక్టర్ - జోయా అక్తర్ (గల్లీ బోయ్)

♦ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సోంచిరియా, ఆర్టికల్ 15

♦ ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - ఆయుష్మాన్ ఖురానా (ఆర్టికల్ 15)

♦ ఉత్తమ నటి (క్రిటిక్స్) - తాప్సి పన్ను, భూమి పెడ్నేకర్ (సాంద్ కి ఆంఖ్)

♦ ఉత్తమ సహాయ నటుడు - సిద్ధాంత్ చతర్వేది (గల్లీ బోయ్)

♦ ఉత్తమ సహాయనటి - అమృతా సుభాష్ (గల్లీ బోయ్)

♦ ఉత్తమ సాహిత్యం - డివైన్, అంకుర్ తివారి (చిత్రం: గల్లీ బోయ్, పాట: అప్నా టైమ్ ఆయేగా)

♦ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ - గల్లీ బోయ్, కబీర్ సింగ్

♦ ఉత్తమ నేపథ్య గాయని - శిల్పా రావ్ (చిత్రం: వార్, పాట: ఘుంగ్రూ)

♦ ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజిత్ సింగ్ (చిత్రం: కలంక్, పాట: కలంక్ నహి)

♦ ఉత్త తొలిపరిచయ నటుడు - అభిమన్యు దస్సాని (మర్ద్ కో దర్ద్ నహీ హోతా)

♦ ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు - ఆదిత్య ధార్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)

♦ బెస్ట్ యాక్షన్ - పాల్ జెన్నింగ్స్, ఓ సీ యంగ్, పర్వేజ్ షేక్, ఫ్రాంజ్ స్పిల్హాస్ (వార్)

♦ ఉత్తమ తొలిపరిచయ నటి - అనన్య పాండే (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2)

♦ బెస్ట్ కొరియోగ్రాఫర్ - రెమో డిసౌజా (చిత్రం: కలంక్, పాట: ఘర్ మోరే పర్దేశియా)

♦ బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ - కర్ష్ కాలే, ది సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ (గల్లీ బోయ్)

♦ బెస్ట్ కాస్ట్యూమ్ - దివ్య గంభీర్, నిధి గంభీర్ (సోంచిరియా)

♦ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - జాయ్ ఓజా (గల్లీ బోయ్)

♦ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సుజన్నే కప్లాన్ మేర్వాన్‌జి (గల్లీ బోయ్)

♦ బెస్ట్ ఎడిటింగ్ - శివకుమార్ వి పనికెర్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)

♦ బెస్ట్ వీఎఫ్ఎక్స్ - షెర్రీ భార్దా, విశాల్ ఆనంద్ (వార్)

♦ బెస్ట్ సౌండ్ డిజైన్ - విశ్వదీప్ ఛటర్జీ, నిహార్ రంజన్ సామల్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)

♦ బెస్ట్ స్క్రీన్‌ప్లే - రీమా కగ్తి, జోయా అక్తర్

♦ ఉత్తమ మాటల రచయిత - విజయ్ మౌర్య (గల్లీ బోయ్)


Show Full Article
Print Article
More On
Next Story
More Stories