3BHK మూవీ ఓటీటీలోకి ఎంట్రీ.. సిద్దార్థ్ మిడిల్ క్లాస్ కలను అద్భుతంగా ఆవిష్కరించిన కథ!

3BHK మూవీ ఓటీటీలోకి ఎంట్రీ.. సిద్దార్థ్ మిడిల్ క్లాస్ కలను అద్భుతంగా ఆవిష్కరించిన కథ!
x

3BHK మూవీ ఓటీటీలోకి ఎంట్రీ.. సిద్దార్థ్ మిడిల్ క్లాస్ కలను అద్భుతంగా ఆవిష్కరించిన కథ!

Highlights

ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రావడం సాధారణం అయింది. స్టార్ హీరోల సినిమాలు నుంచి చిన్న సినిమాల వరకు, చాలా సినిమాలు నాలుగు వారాల్లోనే డిజిటల్ వేదికపై అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి చిత్రాలలో సిద్దార్థ్ నటించిన 3BHK కూడా ఒకటి.

ఈ సినిమా జూలై 4వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. మిడిల్ క్లాస్ కుటుంబం కలలని, ముఖ్యంగా ఓ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చేసే పోరాటాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. నటుడు సరత్ కుమార్, దేవయానిలు హీరో తల్లిదండ్రులుగా నటించారు. హీరోయిన్గా మీతా రంగనాథ్, హాస్యభరిత పాత్రల్లో యోగి బాబు, చైత్ర తదితరులు కనిపించగా, దర్శకత్వం శ్రీ గణేష్ నిర్వహించారు.

ఓటీటీ విడుదల వివరాలు:

ఈ సినిమా ఆగస్టు 1వ తేదీ నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ వేదికపై తెలుగు మరియు తమిళ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. విదేశాల్లోని ప్రేక్షకులు అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా వీక్షించవచ్చు. అయితే భారత్‌లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి ఈ చిత్రం ఆగస్టు 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

మిడిల్ క్లాస్ భావోద్వేగాలకు అద్దం పట్టిన కథ:

ఒక సాదాసీదా కుటుంబానికి సొంత ఇల్లు అనేది కల మాత్రమే కాక గౌరవంగా కూడా భావిస్తారు. ఆ కలను నెరవేర్చేందుకు జీవితం మొత్తాన్ని త్యాగాలు చేస్తూ గడపాల్సిన పరిస్థితులను ఈ సినిమా చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఈ సినిమాలో సిద్దార్థ్ పోషించిన పాత్ర కూడా గత పాత్రల కంటే గాఢమైన భావోద్వేగాలతో ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అలానే ఆదరణ పొందుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories