30 రోజుల్లో ప్రేమించడం ఎలా?..సాయం చేసిన తమన్నా

30 రోజుల్లో ప్రేమించడం ఎలా?..సాయం చేసిన తమన్నా
x
30RojulloPreminchadam Ela
Highlights

బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'

బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. టైటిట్ ప్రకటించిన అప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇందుకు తగ్గట్టుగా సినిమా యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్లుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధిచిన పోస్టర్ రానా విడుదల చేయగా.. ఈ సినిమాలోని తొలి పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలోని రెండు లిరికల్ పాటలు మిల్క్‌ బ్యూటీ తమన్నా ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

కాగా.. తమన్నా పాటలు విడుదల చేయడం పట్ల సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. తమన్నా చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ తెలిపారు. నెటిజన్లు తమన్నా ఈ సినిమా కోసం తన వంతు సహయం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తు్న్నారు.

ఈ సినిమాలో వచ్చే 'నీలి నీలి ఆకాశం' ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చెప్పనక్కర్లేదు. మరో సాంగ్ స్నేహం చెబుతూ సాగే "ఇదేరా స్నేహం.. కనివిని ఎరుగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం.. దేహం అడగని స్నేహం..'అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌ యూత్ ను ఆకట్టుకుంటుంది. ఈ పాటను అలవైకుంఠపురంలో 'బుట్టబొమ్మ' ఫేమ్‌ అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. చంద్రబోస్‌ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ బాణీలు అందించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories