మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. 75 రూపాయలకే మల్టీప్లెక్స్‌లో ...

23rd September is National Film Day
x

మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. 75 రూపాయలకే మల్టీప్లెక్స్‌లో ...

Highlights

*సెప్టెంబరు 23న జాతీయ చలనచిత్ర దినోత్సవం

National Film Day: రెండు వారాల క్రితం సెప్టెంబర్ 16 నేషనల్ సినిమా డేగా ప్రకటించిన మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, ఆ రోజు టికెట్ రేట్‌ను కేవలం 75 రూపాయలకు అమ్ముతామని ప్రకటించాయి.‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మూవీ లవర్స్ టికెట్స్ బుకింగ్ కోసం ఎదురుచూసారు. అయితే హఠాత్తుగా దాన్ని వారం వాయిదా వేసి సెప్టెంబర్ 23కి షిఫ్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నేష‌న‌ల్ సినిమా డేని పురస్కరించుకుని అమెరికా, బ్రిట‌న్ దేశాల్లో సెప్టెంబ‌రు 3న సినిమా టికెట్ ధ‌ర‌ను త‌గ్గించి 3 డాల‌ర్లకు ఫిక్స్ చేశారు. అక్కడ మామూలుగా టికెట్ ధ‌ర 8 డాల‌ర్లు ఉండగా , డిమాండును బ‌ట్టి ప్రిమియ‌ర్ షోల‌కు 35-40 డాల‌ర్లకు కూడా అమ్ముతుంటారు. నేషనల్ సినిమా డే సందర్బంగా 3 డాల‌ర్లకు మ‌ల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవ‌కాశం ద‌క్కడంతో ప్రేక్షకులు థియేట‌ర్లకు పోటెత్తారు.

ఓవర్సీస్ లో మన తెలుగు సినిమా కార్తికేయ‌-2 నాలుగో వీకెండ్‌లో హౌస్ ఫుల్స్‌తో న‌డిచిందంటే దానికి నేష‌న‌ల్ సినిమా డే సంద‌ర్భంగా త‌గ్గించిన రేట్లే కార‌ణం. ఇక ఇప్పుడు ఇండియాలో కూడా నేష‌న‌ల్ సినిమా డేను జ‌రుపుకోవ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. తొలుత సెప్టెంబ‌రు 16న ఇందుకు ఏర్పాట్లు జరగగా, మ‌ల్టీప్లెక్సుల‌న్నింట్లోనూ 75 రూపాయల రేటును ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు కొన్ని రోజుల ముందే ప్రక‌ట‌న రావ‌డంతో సినీ ప్రియులు ఆ రోజు కోసం ఎదురు చూశారు. ఐతే కొన్ని కార‌ణాలతో సెప్టెంబ‌రు 16న జరగాల్సిన నేష‌న‌ల్ సినిమా డేను వారం వాయిదా వేశారు. సెప్టెంబ‌రు 23కు ఫిక్స్ చేశారు. ఆ రోజే జాతీయస్థాయిలో సినీ వేడుక‌లు జ‌రగ‌నున్నాయి. ఆ రోజున టికెట్ ధ‌ర 75 రూపాయలు మాత్రమే ఉండ‌బోతోంది.

సినిమా డే సందర్బంగా భారీ చిత్రాలను కూడా తక్కువ ధరకే చూసే అవకాశం ఆడియన్స్ కు లభించనుంది. 2022 చివ‌ర్లో అవ‌తార్-2 విడుదలకు సిద్ధమవుతోన్న నేప‌థ్యంలో అవ‌తార్ తొలి భాగాన్ని సెప్టెంబరు 23న రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాల‌జీతో రీమాస్టర్ చేసి రిలీజ్ చేస్తుండ‌డంతో ఆ సినిమా కోసం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. అదే రోజు టికెట్ ధ‌ర‌ను 75 రూపాయలకు త‌గ్గిస్తుండ‌డంతో అవ‌తార్ ప్రదర్శించే థియేట‌ర్లు జ‌నాల‌తో నిండిపోవ‌డం ఖాయంగా కనిపిస్తొంది. అదే రోజు రిలీజ‌య్యే వేరే చిత్రాల‌కు కూడా మంచి ఆక్యుపెన్సీనే లభించే అవకాశం ఉంది. టికెట్ ధర తగ్గడంతో రెవెన్యూపై ఎఫెక్ట్ ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు.

తెలుగులో అదే రోజు వస్తున్న అల్లూరి, గుర్తుందా శీతాకాలం, దొంగలున్నారు జాగ్రత్త, కృష్ణ వృందా విహారి లాంటి వాటికి కొన్ని ఇబ్బందులు తప్పవు. హిందీలో దుల్కర్ సల్మాన్ చుప్ సినిమా విడుదలకు ఉంది.‌ఇప్పుడు వీరిలో‌ కొందరు తమ‌ సినిమాల విడుదలను వారం వెనక్కి తీసుకు వెళితే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చారు.‌ అక్టోబర్ 29 నుంచి రెండు వారాల పాటు, దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో , సినిమాలను వారం వాయిదా వేయటం వల్ల పండుగ సీజన్ ను ఉపయోగించే అవకాశం లభించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories