Mahesh Babu: తీవ్ర విషాదంలో మహేశ్‌బాబు.. ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయి..

Mahesh Babu: కావాల్సిన వాళ్లు.. అందులోనూ కుటుంబ సభ్యులు.. దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం.

Arun Chilukuri
Published on: 15 Nov 2022 12:06 PM IST
2022 Year of Emotional Setbacks and Personal Losses for Mahesh Babu
X

Mahesh Babu: తీవ్ర విషాదంలో మహేశ్‌బాబు.. ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయి..

Mahesh Babu: కావాల్సిన వాళ్లు.. అందులోనూ కుటుంబ సభ్యులు.. దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. కన్నవారు, తోబుట్టువులు తిరిగిరాని లోకాలకు వెళ్తే.. అది మాటలకందని విషాదం. అలాంటిది నెలల వ్యవధిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు సినీ నటుడు మహేశ్‌బాబు. తన సోదరుడు రమేశ్‌బాబుని పోగొట్టుకున్న బాధలో ఉన్న మహేశ్‌ బాబు కోలుకునేలోపే ఆయన తల్లి ఇందిరా దేవి చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకునేలోపు తండ్రి కృష్ణ మరణం ఆయన్ను మళ్లీ విషాదంలోకి నెట్టేసింది.

ఈ కష్టకాలంలో మహేశ్‌కు శక్తినివ్వాలంటూ అభిమానులు, సినీ ప్రముఖులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు ధైర్యాన్ని్చ్చేలా సందేశాలు పెడుతున్నారు. ఈ ఏడాది జనవరి 8న మహేశ్‌ సోదరుడు రమేశ్‌బాబు కాలేయ సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఆయన తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యతో సెప్టెంబరు 28న కన్నుమూశారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ... మహేశ్‌బాబును విడిచి వెళ్లిపోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story