20 Years for Kushi Movie: 20 ఏళ్ల పవన్ ఖుషీ.. ట్విట్టర్లో ఫ్యాన్స్ ట్రెండింగ్

20 Years For Power Star Pawan Kalyan Kushi Movie | Kushi Telugu Movie
x

పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా పోస్టర్లు (ఫొటో ట్విట్టర్)

Highlights

20 Years for Kushi Movie: పవన్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా పేరొందిన ఖుషీ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు.

20 Years for Kushi Movie: పవర్ స్టార్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా పేరొందిన ఖుషీ సినిమా... సృష్టించిన రికార్డులు చెప్పలేనివి. పవన్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. పవన్ తో పోటాపోటీగా నటించింది భూమిక. శ్రీసూర్య మూవీస్ పై ఏ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో విజయ్ నటించిన ఖుషీకి తెలుగు రీమేక్ గా తీశారు. నేటికి ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని సన్నివేశాలను, రికార్డులను #20YearsForClassicIHKushi, #Kushi, #Pawanakalyan ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇక ఈ సినిమాకు హైలెట్ అంటే.. పవన్- భూమిక సన్నివేశాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఈ క్లాసికల్ సినిమాలోని పాటలు, పవన్ మ్యానరిజం, డైలాగ్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే.. అన్నీ హైలెట్ గానే అనిపిస్తాయి.

భూమిక బొడ్డు చూపించే సన్నివేశం ఇప్పటికీ కొన్ని సినిమాల్లో ఇమేటేట్ చేస్తుండడం విశేషం. బాక్సాఫీస్ వద్ద ఆ రోజుల్లోనే రూ. 20కోట్ల వసూళ్లతో ఓ చరిత్ర సృష్టించింది ఈ చిత్రం.

కథ:

కలకత్తా లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్(పవన్ కళ్యాణ్)... హయ్యర్ స్టడీస్ కోసం కెనడా బయలు దేరుతాడు. ఇంతలో ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దీంతో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాయిన్ అవుతాడు. కైకలూరు లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత(భూమిక)కి పెళ్లిచూపులు జరుగుతుంటాయి. కానీ, వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్తున్నానని లేఖ రాయటంతో.. ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. దీంతో మధు కూడా ఉన్నత విద్య కోసం అదే విశ్వవిద్యాలయంలో చేరుతుంది.

సిద్ధు, మధులు స్నేహితులుగా మారిపోతారు. వీరిద్దరి స్నేహితులు ప్రేమికులు కావటంతో.. వారికి సహాయం చేయడం కోసం సిద్ధూ- మధు ఒకరికొకరు దగ్గరవుతారు. మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని చెప్పడానికి ఆలోచిస్తుంటారు. ఓసారి సిద్దూ దూకుడు స్వభావంతో మధు మనసులో స్థానం కోల్పోతాడు. ఇలా దూరమైన వీరిరువు మరలా ఎలా కలిశారు? వీరి మనతత్వాలు ఏలా మర్చుకున్నారు? పెళ్లి తరువాత సిద్ధూ- మధులు ఎలా ఎన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రానికి ఎండ్ కార్డు.

ఖుషీ విశేషాలు..

  • తమిళంలో హీరోహీరోయిన్ల పాత్రల తీవ్రత.. ప్రాముఖ్యత ఇంచుమించు సమానంగా ఉంటాయి. కానీ, తెలుగులో హీరోదే పై చేయి గా ఉంటుంది.
  • కేకేతో మణి శర్మ మొదటి సారి పాడించిన హిందీ సాంగ్ `యే మేరా జహాన్ ..` తెలుగు చిత్ర రంగంలో నే తొలి ప్రయోగం. ఈ పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది.
  • సెకాండాఫ్ లో వచ్చే కార్నివాల్ ఫైట్ సీన్స్‌కు పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ ఫైల్ షూటింగ్‌కి వాడిన కెమెరా పనితనం, మార్షల్ ఆర్ట్స్, పవన్ లోని సృజనాత్మకతకి పరాకాష్టలుగా నలిచాయి.
  • మిస్సమ్మ లోని ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే పాటను ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు. ఈ పాట ఓ ట్రెండ్ సెట్టర్ లా మారిపోయింది.
  • సిద్ధూ- మధులు పసిపాపలుగా ఒకరినొకరు చేతులతో స్పృశించుకొని సన్నివేశం అద్భుతహా అనిపిస్తుంది. ఈ సీన్ లో వచ్చే నేపథ్య సంగీతం సినిమాకే హైలేట్ గా ఉంటుంది.
  • బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు.
  • ఎయిర్ పోర్టుకు వెళ్ళే దారిలో హీరో కి జరిగే రోడ్డు ప్రమాదానికి కారణమయ్యే పాత్రలో ఎస్. జే. సూర్య నే పోషించాడు. తమిళం, తెలుగులోనూ ఆయన నటించడం విశేషం.
  • ఈ చిత్రానికి కాస్ట్యూమ్ లను రేణు దేశాయ్ రూపొందించారు.
  • 79 సెంటర్లలో 100 రోజులు ఆడింది. అలాగే 8 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఇలా మరెన్నో రికార్డులను క్రియోట్ చేసి పవన్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories