రమణ.. ఈరోజు నీ డైలాగే పేలింది!

రమణ.. ఈరోజు నీ డైలాగే పేలింది!
x
Highlights

మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు'.. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా మంచి సక్సెస్...

మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు'.. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకని వరంగల్ లో నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ సినిమాలో అనిల్ రావిపూడి ఎన్నో డైలాగ్స్ రాశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ సినిమా మొత్తంలో "రమణ లోడ్ ఎత్తాలి రా.. చెక్ పోస్ట్ పడతాది" అంటూ మీరు చెప్పిన ఒక్క డైలాగే బాగా పేలిందని ఆ సన్నివేశంలో నటించిన నటుడును మెచ్చుకున్నారు మహేష్ బాబు..సినిమాలో నటించిన నటులకి , సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు తెలిపారు మహేష్ .

ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ రోల్ లో కనిపించారు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. విజయశాంతి కీలకపాత్రలో కనిపించారు. సంగీత, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories