Virupaksha: విరూపాక్ష మూవీ రివ్యూ.. ప్రేక్షకులను కట్టిపడేసే మంచి మిస్టరీ థ్రిల్లర్..

Virupaksha Movie Review In Telugu
x

Virupaksha: విరూపాక్ష మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Virupaksha: విరూపాక్ష మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: విరూపాక్ష

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమాటం, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, ఝాన్సి, రాజీవ్ కనకాల తదితరులు

సంగీతం: బీ అజనీష్ లోకనాథ్

సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుదీన్

నిర్మాతలు: బీ వీ ఎస్ ఎన్ ప్రసాద్, సుకుమార్

దర్శకత్వం: కార్తిక్ వర్మ దండు

బ్యానర్లు: శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్

విడుదల తేది: 21/04/2023

వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒక్క మంచి బ్లాక్ బస్టర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021 లో "రిపబ్లిక్" సినిమాతో ఫ్లాప్ అందుకున్న సాయి తేజ్ బైక్ ఆక్సిడెంట్ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు "విరూపాక్ష" అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ మెగా మేనల్లుడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. కార్తీక్ వర్మ దండు అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఇవాళ అనగా ఏప్రిల్ 21, 2023 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతో మెగా హీరో ఎంతవరకు ప్రేక్షకులను అలరించాడో చూసేద్దామా..

కథ:

సినిమా కథ 1979 బ్యాక్ డ్రాప్ లో రుద్రవరం అనే ఒక పల్లెటూరులో మొదలవుతుంది. చేతబడి చేసి పిల్లల్ని చంపేస్తున్నారు అని పూరి జనం ఒక జంటని అందరి ముందు మంటల్లో కాల్చేస్తారు. చనిపోతూ ఆ జంట ఒక పుష్కర కాలంలో ఊరు ఊరంతా స్మశానం అయిపోతుంది అని శపిస్తారు. కథ మళ్ళీ 1991 లోకి వస్తుంది. ఇటువంటి కారణం లేకుండానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఊర్లో చనిపోతూ ఉంటారు. దీంతో ఊరి ప్రజలు తమ ఊరిని అష్టదిగ్బంధనం చేస్తారు. అయినప్పటికీ అక్కడ జరిగే చావులు ఆగవు. అప్పుడే సూర్య (సాయి ధరంతేజ్) రంగంలోకి దిగి ఈ చావుల వెనుక మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూర్యకి రుద్రవనం కి ఉన్న సంబంధం ఏమిటి? అసలు సూర్య ఆ ఊరికి ఎందుకు వచ్చాడు? శాపగ్రస్తమైన ఆ ఊరి ప్రజలను సూర్య కాపాడగలిగాడా? చివరికి ఏమైంది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

సాయిధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత మళ్లీ వెండి తెర మీద కనిపించారు. యాక్సిడెంట్ దెబ్బల నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత సై తేజ్ మొదటి సినిమా ఇది. సినిమాల నుండి కొంచెం బ్రేక్ తీసుకున్నప్పటికీ, సాయి తేజ్ మళ్లీ తన నటన తో బాగానే ఆకట్టుకున్నారు. తన పాత్ర కి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. సంయుక్తా మీనన్ నటన ఈ సినిమాకి బాగానే ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఆమెకు స్క్రీన్ టైం తక్కువే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో ఆమె పాత్ర కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే సాయి తేజ్ తో సంయుక్త కెమిస్ట్రీ మాత్రం అంత వర్క్ అవుట్ అవ్వలేదు అని చెప్పుకోవాలి. అభినవ్ గోమాటం నటన కూడా బాగుంది. సాయి చంద్ మరియు సునీల్ కూడా సినిమాలో బాగానే నటించారు. బ్రహ్మాజీ కూడా నటనతో మంచి మార్కులు వేయించుకున్నారు. అజయ్ మరియు ఝాన్సి కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ కథ సినిమాకి ఆయువుపట్టు గా చెప్పుకోవచ్చు. కథ కి తగ్గట్టుగానే ఏ మాత్రం డీవియేట్ అవ్వకుండా టైట్ స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దానిని అంతే బాగా ఎక్జిక్యూట్ కూడా చేశారు. కథని ఎక్కడా బోర్ కొట్టించకుండా బాగానే నేరెట్ చేశారు. పాత్రలను బాగానే ఎస్టాబ్లిష్ చేసి కథకి లింక్ చేసిన విధానం కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకి హై లైట్ అయ్యాయి. బీ అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం చాలా బాగుంది. కొన్ని పాటలు బాగా వచ్చాయి. సినిమాటోగ్రాఫర్ పనితనం సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్టు బాగా సెట్ అయ్యింది. కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.

బలాలు:

కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు

స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే

నేపథ్య సంగీతం

ఆర్ట్ డిజైన్

సాయి ధరమ్ తేజ్ నటన

బలహీనతలు:

ఫస్ట్ హాఫ్ లోని ప్రేమ కథ

కొన్ని బోరింగ్ సన్నివేశాలు

చివరి మాట:

మొట్ట మొదటి సన్నివేశం తోనే సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ మరియు లవ్ ట్రాక్ ఉంటుంది కానీ ప్రేమ కథ కి ప్రేక్షకులు అంత కనెక్ట్ కాలేకపోవచ్చు. కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినప్పటికీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. డైలాగులు మరియు సన్నివేశాలు కూడా ఆసక్తికరం గా ఉంటాయి. ఇంటర్వల్ సీన్ సినిమాకి హై లైట్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మిస్టరీ ని రివేల్ చేసిన విధానం, కథలోని చాలా పాత్రలకు కథ ని లింక్ చేసిన విధానం చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించనిదే కానీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. సీక్వెల్ కి హింట్ తో సినిమా ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా "విరూపాక్ష" సినిమా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఆసక్తికరమైన సినిమా.

బాటమ్ లైన్:

"విరూపాక్ష" ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే మంచి మిస్టరీ థ్రిల్లర్..

Show Full Article
Print Article
Next Story
More Stories