Virata Parvam Movie Review : విరాట పర్వం మూవీ రివ్యూ.. ప్రేక్షకుల మనుసులు గెలిచిందా.. ?

Virata Parvam Movie Review  |  Tollywood News
x

Virata Parvam Movie Review : విరాట పర్వం మూవీ రివ్యూ.. ప్రేక్షకుల మనుసులు గెలిచిందా.. ?

Highlights

Virata Parvam Movie Review : విరాట పర్వం మూవీ రివ్యూ.. ప్రేక్షకుల మనుసులు గెలిచిందా.. ?

Virata Parvam Movie Review :

చిత్రం: విరాట పర్వం

నటీనటులు: సాయి పల్లవి, రానా, ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహాబ్, ఈశ్వరి రావు, సాయి చంద్, నివేద పెతురాజ్, తదితరులు

సంగీతం: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: డాని సంచెజ్ లోపెజ్, దివాకర్ మణి

నిర్మాతలు: సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం: వేణు ఉడుగుల

బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్

విడుదల తేది: 17/06/2022

ఈ మధ్యనే "భీమ్లా నాయక్" సినిమాతో హిట్ అందుకున్న రానా దగ్గుబాటి తాజాగా ఇప్పుడు "విరాటపర్వం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నక్సల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక అందమైన ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా నెలలు గడిచింది. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో ఇవాళ అనగా జూన్ 17 న విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

ఈ సినిమా 1973 లో వెన్నెల (సాయి పల్లవి) అనే అమ్మాయి పుట్టుకతో మొదలవుతుంది. అర్థరాత్రి పోలీసులు మరియు నక్సలైట్ ల మధ్య జరిగే కాల్పుల మధ్య పుట్టిన వెన్నెల చాలా అల్లారుముద్దుగా పెరిగింది. ఒక నక్సలైట్ మరియు కవి అయిన రవన్న (రానా) రాసే పద్యాలు చదివి అతనితో ప్రేమలో పడుతుంది. తనతోనే కలిసి నడవాలని నిర్ణయించుకుని అతనిని కలవడానికి వెళ్తుంది. వెన్నెల రవన్న ని కలిసిందా? రవన్న వెన్నెల ను ప్రేమిస్తాడా? రవన్న వల్ల వెన్నెల జీవితం ఎలా మారింది? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

సాయి పల్లవి ఈ సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. సినిమా కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. తన అద్భుతమైన నటనతో సాయిపల్లవి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయి చాలా బాగా నటించింది. ఈ సినిమాలో తన కరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ అందించిన సాయి పల్లవి తన పాత్రకి చాలా బాగా న్యాయం చేసింది. రానా కూడా తన పాత్రలో చాలా బాగా నటించారు. సినిమా కథ మొత్తం సాయిపల్లవి పాత్ర చుట్టూ తిరుగుతుంది అయినప్పటికీ ఇలాంటి పాత్రని ఒప్పుకోవడం లో రానా నిజంగా గొప్ప అని చెప్పుకోవచ్చు. నవీన్ చంద్ర మరియు ప్రియమణి కూడా తమ పాత్రలను బాగానే నటించారు. సాయి చంద్ నటన సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. నివేత పేతురాజ్ చిన్న క్యామియో పాత్ర అయినప్పటికీ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

నక్సలిజం, యుద్ధం మధ్యలో కూడా ఒక అందమైన ప్రేమ కథ ని సృష్టించవచ్చు అని వేణు ఉడుగుల ఈ సినిమాతో నిరూపించారు. చుట్టూ ఎన్ని దారుణాలు జరుగుతున్నా రవన్నతో వెన్నెల తన భవిష్యత్తు గురించి ఆలోచించే విధానాన్ని వేణు ఉడుగుల చాలా బాగా చూపించారు. అక్కడక్కడ నెరేషన్ కొంచెం అటు ఇటు అయినప్పటికీ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రీకరించారు వేణు ఉడుగుల. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. డానీ మరియు దివాకర్ మణి అందించిన విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం కూడా సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

బలాలు:

సాయి పల్లవి

నటీనటులు

ప్రేమ కథ

సినిమాటోగ్రఫీ

బలహీనతలు:

కొన్ని స్లో సన్నివేశాలు

కథ ప్రెడిక్టబుల్ గా అనిపించడం

నెరేషన్

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. దాదాపు కథ మొత్తం సాయి పల్లవి పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆమె ప్రయాణం, ఆమె ప్రేమ కథ, ఆమె నమ్మకం సినిమాని ముందుకు తీసుకు వెళుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో నెరేషన్ కొంచెం స్లో అయింది అనుకున్నప్పటికీ సాయిపల్లవి తన నటన తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్స్ చాలా బాగా చిత్రీకరించారు. సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ సాయి పల్లవి మరియు రానా ల నటన వాటిని డామినేట్ చేసేలానే ఉంటాయి. చివరిగా "విరాటపర్వం" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించ గల ఒక మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథ.

బాటమ్ లైన్:

"విరాట పర్వం" ఒక అందమైన ప్రేమ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories