'వినయ విధేయ రామ' మూవీ రివ్యూ

vvr
x
vvr
Highlights

గతేడాది రంగస్థలం సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది బోయపాటి దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండుగకి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి వినయ విధేయ రాముడిగా రామ్ చరణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

చిత్రం: వినయ విధేయ రామ

నటీనటులు: రామ్ చరణ్, కీయారా అద్వానీ, వివేక్ ఒబెరోయి, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, మధుమిత తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: ఆర్థర్ ఏ విల్సన్, రిషి పంజాబీ

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మిరాజు

నిర్మాత: డి.వి.వి.దానయ్య

దర్శకత్వం: బోయపాటి శ్రీను

బ్యానర్: డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్

విడుదల తేదీ: 11/01/2019

గతేడాది రంగస్థలం సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది బోయపాటి దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండుగకి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి వినయ విధేయ రాముడిగా రామ్ చరణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భారీ అంచనాల మధ్య జనవరి 11వ తేదీన విడుదలైంది 'వినయ విధేయ రామ' సినిమా. ఇప్పటికే టీజర్ మరియు ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. ఈ సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఫాన్స్ విశ్వసిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పై మంచి టాక్ ఉంది. మరి ఇంతకీ సినిమా ఎలా ఉందో చూశారా చూసేద్దామా.

క‌థ:

అనగనగా ఐదుగురు అన్నదమ్ములు (ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌, రామ్‌ చరణ్‌). వారిదొక అందమైన, హ్యాపీ ఫ్యామిలీ. అందరి కన్నా చిన్నవాడు రామ్ కొణిదెల (రామ్ చరణ్). కుటుంబం అంటే రామ్ కు పంచప్రాణాలు. పెద్ద‌న్నయ్య (ప్ర‌శాంత్‌) విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ జరుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం (ముఖేష్ రుషి) అరాచ‌కాల‌కు అడ్డుకట్ట వేస్తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రుగుతుంది. రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేయాలని పరశురాం బిహార్‌లో ఉన్న రాజాభాయ్‌ (వివేక్ ఒబెరాయ్‌)ను రంగంలోకి దింపుతాడు. రాజాభయ్ కి రామ్ కుటుంబానికి అంతకుముందు నుండే శత్రుత్వం ఉంది. ఎందుకు? త‌న కుటుంబాన్ని రామ్ ఎలా కాపాడుకుంటాడు? ఈ నేపధ్యంలో ఏం చేస్తాడు అన్నదే కథ.

నటీనటులు:

ఈ సినిమాలో రామ్ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా, ల‌వ్‌, ఫ‌న్‌, ఫైట‌ర్ ఇలా అన్ని కోణాల్లోనూ రామ్ చరణ్ అదరగొట్టాడు అని. సిక్స్‌ప్యాక్ తో రామ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అభిమానుల‌ను మెప్పిస్తాయి. కియారా అడ్వానీ చాలా అందంగా చూపించారు. ఆమె పాత్ర‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు కాబట్టి నటనకు అంత స్కోప్ లేదు. ఉన్న స్కోప్ లో బాగానే నటించింది కీయారా. అన్న‌ద‌మ్ములుగా ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ చాలా బాగా నటించారు. ముఖ్యంగా ప్ర‌శాంత్‌ తన పెర్ఫార్మెన్స్ తో అలరిస్తాడు. ఆర్య‌న్ రాజేష్ కూడా పర్వాలేదు అనిపించాడు. ఇక ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో పాత్రకు ఊపిరి పోసాడు. విలన్ గా చాలా పవర్ ఫుల్ పాత్ర పోషించిన వివేక్ కు నూటికి నూరు మార్కులు వేయచ్చు.

సాంకేతిక వర్గం:

బోయ‌పాటి చిత్రాల్లో యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉంటుందని తెలిసిందే. అలాగే కుటుంబం, అనుబంధాల‌ను కూడా బాగా చూపిస్తారు. ఈసారి ఆ రెండిటి మోతాదు బాగా పెంచేశారు. అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా యాక్షన్ సీన్లు తీద్దామనుకున్న బోయ‌పాటి ఇద్దరిని మెప్పించలేకపోయాడు. మాస్ ప్రేక్షకులకు కూడా హింస మరీ ఎక్కువైనట్టే అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే యాక్ష‌న్ సీక్వెన్స్ మాత్రం ప్లస్ పాయింట్ అవుతుంది. డి.వి.వి. దానయ్య నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు కొంచెం యావరేజ్ గా ఉన్నా నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపించింది. రామ్‌చ‌ర‌ణ్ స్టెప్‌లు సినిమాకు హైలైట్. మాటలు పవర్ ఫుల్ గా బాగున్నాయి. రిషి పంజాబీ, ఆర్థర్ ఏ విల్సన్ విజువల్స్ చాలా బాగా వచ్చాయి. కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మిరాజు ఎడిటింగ్ బాగానే ఉంది.

బ‌లాలు:

కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్లు

రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు

ఇంటర్వెల్ సీన్

బ‌ల‌హీన‌త‌లు:

భరించలేనన్ని ఫైట్లు

బలమైన కథ లేకపోవడం

చివరి మాట:

బోయపాటి సినిమా అంటేనే యాక్షన్ మరియు ఎమోషన్ అని తెలిసిందే. అయితే 'వినయ విధేయ రామ' సినిమాలో మాత్రం యాక్షన్ సన్నివేశాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎమోషన్లకు ముఖ్యంగా కథకు ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. మాస్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవచ్చు కానీ క్లాస్ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవచ్చు.

బాటమ్ లైన్:

'వినయ విధేయ రాము'డి కంటే విధ్వంస రాముడు ఎక్కువ కనిపించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories