మూవీ రివ్యూ: 'వెంకీ మామ' మెరిపించాడు!

మూవీ రివ్యూ: వెంకీ మామ మెరిపించాడు!
x
Highlights

తెలుగు సినిమా అంశాల్లో 'వెంకీ మామ' సినిమా ఒకటి. సినిమా ప్రారంభం నుంచీ సినిమా పై అందరికీ ఆసక్తి కలిగింది. నిజ జీవితంలో మామ అల్లుళ్లు.. వెండి తెరపై...

తెలుగు సినిమా అంశాల్లో 'వెంకీ మామ' సినిమా ఒకటి. సినిమా ప్రారంభం నుంచీ సినిమా పై అందరికీ ఆసక్తి కలిగింది. నిజ జీవితంలో మామ అల్లుళ్లు.. వెండి తెరపై కూడా అవే పాత్రలు చేయటమే దానికి కారణం. వీరిద్దరూ రెండు తెలుగు తెర లెజెండ్స్ కుతుమ్బమాలకు చెందిన వారు కావడంతో అది మరింత పెరిగిపోయింది. ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానులు..అటు అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూస్తూ వచ్చారు. అదీ కాకుండా.. విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఎఫ్2 వంటి సూపర్ హిట్ సినిమాలో చేశారు. అది మల్టీస్టారర్ సినిమా. సంవత్సరం చివర్లోనూ ఆయన మరో భారీ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా భారీ అంచనాల నడుమ, వెంకటేష్ పుట్టినరోజు కానుకగా 'వెంకీమామ' ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కథా కమామీషు తెలుసుకుందాం.. ఎలా వుందో చెప్పేసుకుందాం!

ఇదీ కథ!

ప్రముఖ జ్యోతిష్యుడైన రామనారాయణ (నాజర్‌) కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమవివాహం చేసుకుంటుంది. అయితే, ఆ దంపతులిద్దరు రోడ్డుయాక్సిడెంట్‌లో చనిపోతారు. దీంతో జాతకం దృష్ట్యా ఆ దంపతుల ఏడాది వయసున్న కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే రామనారాయణ కొడుకు వెంకటరత్నం(వెంకటేశ్‌) ఆ చిన్నారిని ప్రేమగా చేరదీస్తాడు. మేనమామగా తన మేనల్లుడి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. ఇక తనను అంత ప్రేమించి పెద్ద చేసిన తన మామ కోసం లండన్‌లో మంచి ఉద్యోగాన్ని, తన ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్‌ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్‌.. కార్తీక్‌ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, జాతక ప్రభావం మామకు దూరంగా వెళ్లిపోయి, కార్తీక్‌ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. మేనల్లుడి కోసం ఏం చేసాడు అన్నదే మిగతా కథ!

ఎలా వుందంటే..

చిన్న లైన్ కథ.. మామా అల్లుళ్ళ బంధంలో జాతాక రీత్యా ఎదురైన కష్టాల్ని ఎదుర్కోవడం.. వాటి నుంచి బయట పడడం ఇంతే. కానీ, దీన్ని తన స్క్రీన్ప్లే బలంతో తెర మీద ఆసక్తికరంగా ఆవిష్కరించారు దర్శకుడు బాబీ. ప్రధమార్థమంతా కామెడీతో వినోదాత్మకంగా నడిపించాడు. వెంకటేష్ మేనరిజమ్స్ కామెడీని పండించాయి. ఇక జబర్దాస్త్ కామెడీ ఆర్టిస్టులు హైపర్ ఆది, చమ్మక్ చంద్రలతో కలసి వెంకటేష్, చైతన్య పండించిన కామెడీ, పాటలు కావల్సినంత వినోదాన్ని పంచాయి. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా కొంత లాజిక్ లేని విధంగా నడుస్తుంది. వినోదం పూర్తిగా తగ్గిపోయి గంభీరంగా సినిమా కదులుతుంది. రొటీన్ గా సాగిపోయినట్టు అనిపిస్తుంది. పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడంతో అంతా సాదా సీదా గా నడిచి పోతుంది.

ఇక, జాతకాలు, నమ్మకాల కన్నా మనిష ప్రేమే గొప్పదన్న సందేశం తో సినిమాకి ముగింపు పలికారు. బాబీ స్క్రీన్ప్లే తో కథను నడిపించిన విధానం బాగుంది. ప్రసాద్ మూరెళ్ళ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంది. తమన్ సంగీతం సినిమాకి ప్లస్ అయింది. డైలాగులలో పంచ్ లు నవ్వించాయి.

ఎవరెలా చేశారంటే..

ఇది వెంకటేష్ షో. చైతన్య సినిమా. మామా అల్లుళ్ళ సినిమా అంతే. వెంకటేష్ తనదైన స్టైల్ లో మేనరిజమ్స్ ఇరగాదీశారంతే. చైతన్య కూడా మామతో పోటీపడి నటించారు. పాటలు,కొన్ని సన్నివేశాలు తప్ప హీరోయిన్లకు పెద్దగా పని లేదు. అక్కడి వరకూ పాయల్, రాశీఖన్న ఆకట్టుకున్నారు. నాజర్‌, గీత, ప్రకాశ్‌ రాజ్‌, రావూ రమేశ్‌, కిషోర్‌, హైపర్‌ ఆది తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

మొత్తమ్మీద వెంకటేష్ తన మార్క్ సినిమాలో అల్లుడు నాగ చైతన్యతో కలసి విక్టరీ వెంకీ మామ అనిపించుకున్నాడు.

గమనిక: ఈ రివ్యూ విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే. అతని అభిప్రాయాలను పొందుపరిచిన విశ్లేషణ ఇది. దీనిని కేవలం అతని అభిప్రాయంగానే పరిగణించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories