logo
సినిమా రివ్యూ

గద్దలకొండ గణేష్ సినిమా రివ్యూ

గద్దలకొండ గణేష్ సినిమా రివ్యూ
X
Highlights

వాల్మీకి ఒక్క ఉదుటున పేరు మార్చుకుని థియేటర్లలోకి గద్దలకొండ గణేష్ గా ఎంటర్ అయిపోయాడు. కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని కోర్టు మేట్లేక్కడంతోపేరుమార్చుకుని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా గద్దలకొండ గణేష్ ఈ రోజు విడుదలైంది.

వాల్మీకి ఒక్క ఉదుటున పేరు మార్చుకుని థియేటర్లలోకి గద్దలకొండ గణేష్ గా ఎంటర్ అయిపోయాడు. కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని కోర్టు మేట్లేక్కడంతోపేరుమార్చుకుని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా గద్దలకొండ గణేష్ ఈ రోజు విడుదలైంది. తమిళ జిగార్తండ సినిమాకి రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనూ చాలా అంచనాలున్నాయి. సినిమా లో వరుణ్ లుక్.. రాఘవేంద్రుడి సూపర్ హిట్ పాట వెల్లువొచ్చి గోదారమ్మ రీమేక్.. మిక్కీ జే మేయర్ సంగీతం ఇలా ఎన్నో అంశాలు సినిమా పై అంచనాల్ని భారీగా పెంచేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా.. లేదా ఒక్కసారి చూద్దాం..

కథ ఇదే..

ఒక రచయిత కం దర్శకుడు రియల్స్తిక్ సినిమా తీయాలనుకుంటాడు. దానికి ఓ గ్యాంగ్ స్టర్ కథ అయితే బావుంటుంది అనుకుని ఫిక్స్ అవుతాడు. అందుకోసం ఎవరి కథ సరిపోతుందా అని అన్వేషిస్తాడు. ఆ అన్వేషణలో అతనికి గద్దలకొండ గణేష్ అనే గ్యాంగ్ స్టర్ కథ అయితే బావుంటుంది అనిపిస్తుంది. అయితే, ఇక్కడో చిక్కు వస్తుంది.. గణేష్ తన గురించి ఎవరన్నా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళ అంటూ చూసే రకం. ఇక సినిమా తీయడానికి అతన్ని ఒప్పించాలంటే ఎంత కష్టం. మరి ఇటువంటి పరిస్త్తితిలో ఆ రచయిత ఎలా గద్దలకొండ ని చేరుకున్నాడు..అతనితో సినిమా ఎలా తీయగలిగాడు. సినిమా హిట్ చేయగలిగాడా? అసలు ఈ గణేష్ కథ ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నిటి సమాధానమే ఈ సినిమా. అవన్నీ వెండితెర మీద చూడాల్సిందే.

ఎవరెలా చేశారు?

ఇక చెప్పాల్సిన పనే లేదు.. ఈ సినిమా వరుణ్ తేజ్ సినిమా. అంతలా సినిమాని మోశాడు వరుణ్. పాత్ర గెటప్.. నడక.. నడత.. మాట.. ముచ్చట ఇలా అన్నిటినీ వరుణ్ కోసమే ఈ పాత్ర పుట్టిందా అన్నంత గొప్పగా ఈ పాత్రలో ఒదిగిపోయాడు. దీనిలో వరుణ్ ని తప్ప మరొకరిని ఊహించే సాహసం కూడా చేయలేమంటే చాలు వరుణ్ తేజ్ గురించి చెప్పటానికి. ఇక హీరోయిన్ గా చేసిన మృణాళిని కి చెప్పుకోదగ్గ స్కోప్ లేదు అయినా ఆమె బాగానే చేశారు. తరువాత ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ గా పూజా హెగ్డే అలనాటి తారగా కనిపించింది. అప్పటి లెక్కల్లో చక్కగా ఒదిగిపోయింది. శ్రీదేవి ని గుర్తు తెచ్చేలా సినిమా పాటలో కూడా చక్కగా కనిపించి మెప్పించింది. కొద్ది సేపే కనిపించినా తనికెళ్ళ భరణి గుర్తుండిపోతాడు. ఇక రచయిత గా నటించిన అథర్వా అదరగొట్టాడు. తమిళ నటుడైనా ఆ లెక్కలో కనబడలేదు. తెలుగులో భవిష్యత్ దొరికే అవకాశం ఉంది.

ఎలా ఉంది?

సినిమాని హరీష్ శంకర్ హ్యాండిల్ చేసిన విధానం బావుంది. తమిళ కథని పెద్దగా మార్పులు చేయకుండా తెలుగుకి అన్వయించిన విధానం బాగానే ఉన్నా కథని మార్చకూడదని తెలుగు కోసం కొన్ని సన్నివేశాలు చొప్పించాడంతో సినిమా కొద్దిగా సాగాతీతలా అనిపించింది. ఇక గణేష్ పాత్రని సినిమాలో చూపించిన విధానానికి హరీష్ కి పూర్తీ మార్కులు ఇవ్వొచ్చు. అదేవిధంగా హరీస్ రాసిన డైలాగులు చాలా చోట్ల పేలాయి. ఇక ఫోటోగ్రఫీ చాలా బావుంది. సాంకేతికంగా చెప్పుకోవాల్సింది సంగీతం. మిక్కీ జే మేయర్ పాటలకు ఇచ్చిన సంగీతమే కాకుండా రీరికార్డింగ్ కూడా అదరగొట్టేశారు. అన్ని విభాగాల్లోనూ ఎడిటింగ్ విభాగమే కొంచెం నిరాశాపరిచినట్టు కనిపించింది. సినిమా చాలా చోట్ల సాగతీతలా అనిపించింది.

మొత్తమ్మీద ఎప్పుడూ కొత్తదనం కావాలనుకునే వరుణ్ తేజ్ ఈ సినిమాలో మరో కొత్తదనం ఉన్న పాత్ర చేసి మెప్పించారు. ఇది పూర్తిగా వరుణ్ సినిమా. అక్కడక్కడా సాగతీత అనిపించినా.. ఆకట్టుకునే సినిమాగానే చెప్పొచ్చు.

గమనిక: ఈ రివ్యూ రచయిత వ్యక్తిగత కోణంలో రాసింది. సినిమాకి సంబంధించిన అభిప్రాయలు రచయిత వ్యక్తిగతం.


Next Story