దుబాయ్ బాబాయ్ రివ్యూ వచ్చేసింది.. సైరా అదుర్స్ అట!

దుబాయ్ బాబాయ్ రివ్యూ వచ్చేసింది.. సైరా అదుర్స్ అట!
x
Highlights

కొత్త సినిమా వస్తోందంటే చాలు మన దుబాయ్ బాబాయ్ రెడీ అయిపోతారు. మరి అయ్యగారు సినిమాలు చూసి రాస్తారో.. అలా..అలా వదిలేస్తారో కానీ, ప్రతి సినిమా విడుదలకు...

కొత్త సినిమా వస్తోందంటే చాలు మన దుబాయ్ బాబాయ్ రెడీ అయిపోతారు. మరి అయ్యగారు సినిమాలు చూసి రాస్తారో.. అలా..అలా వదిలేస్తారో కానీ, ప్రతి సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే ఈయన గారు రేటింగ్ లతో సహా రివ్యూ రాసి పారేస్తారు ట్విట్టర్ లో. ఇప్పుడు మెగాస్టార్ సినిమా సైరా విడుదలకు సిద్ధం అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమాని ఒక రేంజ్ కి తీసుకువెళ్ళిపోయింది.

ఇక విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే మూవీ మార్కెట్ పీఆర్ ఎక్స్ పర్ట్ ఉమైర్ సంధు 'సైరా' చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ఈయన ఇచ్చిన రివ్యూ చూస్తే.. ఇప్పుడే సినిమా చూసేయాలన్న రేంజిలో ఉంది. పైగా సినిమాకి నాలుగు ఫైర్ స్టార్ లు కూడా ఇచ్చేశారు.

'సైరా చిత్రం ఎమోషనల్ రైడ్‌తో అద్భుతంగా ఉంది. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందుతారు. బాహుబలి చిత్రం కల్పన కాని.. ఇది వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. ఏపీ అన్ని రికార్డ్‌లను సైరా స్మాష్ చేస్తుంది. మెగాస్టార్ అభిమానులకు ఈ చిత్రం పండగే' అని రివ్యూ వదిలేశారు సంధు. ఇక ఇది చదివిన మెగా అభిమానులకు పండగలా అనిపించవచ్చు కానీ, ఈయన గారి వలన సినిమాలకు అనవసరమైన హైప్ వచ్చి.. సినిమా విడుదల అయ్యే సరికి అందులో ఏమాత్రం కిక్ తగ్గినా అభిమానులకు నిరాశ కలుగుతోందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', మహేష్ బాబు 'స్పైడర్', అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాలకు ఈయన టాప్ రేటింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా 'సాహో' చిత్రానికి సైతం మైండ్ బ్లోయింగ్ అంటూ రివ్యూ ఇచ్చారు. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో పోలేదన్నది ఇందుకు ఉదాహరణగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా సినిమాకి చాలా ముందుగానే రివ్యూ ఇచ్చేయడం అనే పధ్ధతి తెలుగు పరిశ్రమకు అంత మంచిది కాదనే భావనలో టాలీవుడ్ వర్గాలు ఉన్నాయి.

ఇక సైరా సినిమా విషయానికి వస్తే.. సినిమా కచ్చితంగా హిట్ అనే ప్రేక్షకులు అంతా నమ్ముతున్నారు. ఇటువంటి రివ్యూలతో పనిలేని నమ్మకం అది. ఆ నమ్మకం కచ్చితంగా నిలుస్తుందనే ఆశిద్దాం. అభిమానులే కాదు ప్రేక్షకులంతా సైరా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు మరి కొద్ది రోజుల్లో ఫలిస్తాయి. ఈ లోపు వచ్చే ఇటువంటి రివ్యూలను సరదాగా తీసుకోవాలి. ఏమంటారు?

270 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైరా సినిమా నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు తో బాటుగా హిందీ, మళయాళ, తమిళ, కన్నడ భాషల్లో ఈ భారీ చారిత్రాత్మక చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ వర్క్ లు ఊపందుకున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories