'సూర్యకాంతం' మూవీ రివ్యూ

సూర్యకాంతం మూవీ రివ్యూ
x
Highlights

చిత్రం: సూర్యకాంతం నటీనటులు: నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లీన్ భేసనియా, శివాజీ రాజా, సుహాసిని, సత్య, మధుమణి తదితరులు సంగీతం: మార్క్ కె...

చిత్రం: సూర్యకాంతం

నటీనటులు: నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లీన్ భేసనియా, శివాజీ రాజా, సుహాసిని, సత్య, మధుమణి తదితరులు

సంగీతం: మార్క్ కె రాబిన్

ఛాయాగ్రహణం: హరి జాస్తి

ఎడిటింగ్‌: రవితేజ గిరిజల

నిర్మాతలు: సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్

దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి

బ్యానర్: నిర్వాణ సినిమాస్

విడుదల తేదీ: 29/03/2019

మెగా డాటర్ నిహారిక ఇప్పటికే 'ఒక మనసు', 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రాలలో నటించింది కానీ మంచి గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా హిట్ ఆదుకోవాలి అనే కసితో ఉన్న నిహారిక ప్రస్తుతం తన ఆశలన్నీ 'సూర్యకాంతం' పైనే పెట్టుకుంది. 'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్న కుచి' వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ప్రణీత్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. 'ఈ మాయ పేరేమిటో' ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా నటిస్తుండగా, పెర్లీన్ భేసనియా ఈ చిత్రంలో రెండవ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు హిట్ లేని నిహారిక 'సూర్యకాంతం' సినిమా తో హిట్ అందుకుంటుందో లేదో చూసేద్దామా?

కథ:

అభి (రాహుల్ విజయ్) ఇంట్లోవారు అతనికి ఎలాగైనా పెళ్లి చేసేయ్యాలి అని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పూజ (పెర్లీన్ భేసనియా) తో అభి కి పెళ్లి చేద్దాం అనుకుంటారు. అభి, పూజ లను కూడా బయట కలుసుకునేలా చేస్తారు. కానీ పూజ ని పెళ్లి చేసుకోవడానికి అభి కి మనసొప్పదు. దానికి కారణం అభి ఇంతకుముందే సూర్యకాంతం (నిహారిక కొణిదెల) ని ప్రేమించడం. ఇదే విషయాన్ని కారణంగా చెబుతాడు అభి. స్వతంత్య భావాలున్న సూర్యకాంతానికి పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదు. ఎప్పటికప్పుడు పెళ్లిపై అయిష్టతను వ్యక్తం చేస్తూ వస్తుంది. ఒకవైపు అభిని పూజ గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది కానీ మరొకవైపు అభి మాత్రం సూర్యకాంతం ప్రేమలో మునిగి తేలుతూ ఎటు తేల్చుకోవాలో తెలియక ఇద్దరిమధ్య నలిగిపోతూ ఉంటాడు. సూర్యకాంతం అభి ని పెళ్లి చేసుకుంటుందా? లేదా? పూజ, కాంతం వీరిలో అభి ఎవరిని ఎంచుకుంటాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

సూర్యకాంతం పాత్రలో నిహారిక అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో నిహారిక పాత్రకి నూటికి నూరు మార్కులు పడతాయి అంటే అతిశయోక్తి కాదు. సినిమా మొత్తంలోనూ ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయి అంటే అందులో నిహారికని మొదటగా చెప్పుకోవచ్చు. తన నటనతో బాగా ఆకట్టుకుంది. తన క్యారెక్టర్ కొత్తగాఉన్నప్పటికీ చాలా బాగా నటించింది. అభి పాత్రలో రాహుల్ విజయ్ మంచి నటన ను కనబరిచారు. పెర్లీన్ కూడా చూడచక్కగా ఉండటమే కాక చాలా నటించింది కూడా. మిగిలిన పాత్రల్లో సత్య , శివాజీరాజా, సుహాసిని, మధుమణి తమ తమతమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి, వెబ్ సిరీస్ చేసిన అనుభవంతో ఈ సినిమాను చేయడంతో కొంత వెబ్ సిరీస్ లాగానే అనిపించింది కానీ సినెమలగా అనిపించలేదు. అంతేకాదు దర్శకుడిగా హీరోయిన్ క్యారెక్టర్‌ను క్రేజీగా మాలచడం, ఆ పాత్ర కు లక్ష్యం లేకపోవడం, కన్ఫ్యూజింగ్ గా ఉండడం పెద్దగా ఆకట్టుకోదు. ట్రయాంగిల్ లవ్ స్టొరీ ని బాగానే హ్యాండిల్ చేసాడు కానీ గొడవ విషయంలో కొంత లాజిక్ మిస్ చేసాడు దర్శకుడు. వినోదం ప్రధానంగా తెరకెక్కినప్పటికి కొంత సాగతీత సన్నివేశాలు బోరు కొట్టిస్తాయి. నిర్వాణ సినిమాస్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఏమాత్రం రాజీపడలేదు. రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఫరవాలేదు అనిపించింది. హరి జాస్తి విజువల్స్ చాలా బాగున్నాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగుంది.

బలాలు:

నిహారిక

ఎంటర్ టైన్ మెంట్

కామెడీ

బలహీనతలు:

సాగదీసినట్టు అనిపించే సన్నివేశాలు

డోస్ కి మించిన ఎమోషనల్ సీన్లు

బలహీన కథ

చివరి మాట:

మొదటి హాఫ్ బాగానే సాగినప్పటికీ రెండవ హాఫ్ మొత్తం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ నే ఉంటుంది. సినిమా కథ బలహీనంగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ గా నిలిచింది. ఇక రెండవభాగంలో సెంటిమెంట్, ఎమోషనల్ సీన్లు మరీ సాగదీసినట్టు అనిపించింది. కొన్ని సీన్లు బలవంతంగా నవ్వు తప్పించాలి అని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా సెంకండ్ హాఫ్ లో అభి, కాంతం సీన్ల దగ్గర సినిమా ఎప్పుడు అయిపోతుందో అని ఎదురుచూసేలా చేస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే కొంత పర్వాలేదు కానీ అది కూడా సాగదీయడం చిరాకు తెప్పిస్తుంది. ఓవరాల్ గా సినిమా కేవలం పర్వాలేదు అనిపించింది.

బాటమ్ లైన్:

'సూర్యకాంతం' కాదు 'మోడరన్ సూర్యకాంతం' అనటం సమంజసం.

Show Full Article
Print Article
Next Story
More Stories