ET Movie Review: సూర్య `ఈటీ` మూవీ టాక్ ఎలా ఉందంటే..

ET Movie Review: సూర్య `ఈటీ` మూవీ టాక్ ఎలా ఉందంటే..
x
Highlights

ET Movie Review: సూర్య `ఈటీ` మూవీ టాక్ ఎలా ఉందంటే..

ET Movie Review:

చిత్రం: ఈటీ (ఎతార్కుం తునిందావన్)

నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, మధుసూధన్ రావు, జయప్రకాష్ తదితరులు

సంగీతం: డీ ఇమ్మన్

సినిమాటోగ్రఫీ: రత్నవేలు

నిర్మాత: కళానిధి మారన్

దర్శకత్వం: పాండిరాజ్

బ్యానర్: సన్ పిక్చర్స్

విడుదల తేది: 10/03/2021

ఈ మధ్యనే "సూరరై పోట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా)" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా "జై భీమ్" అనే లీగల్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత సూర్య "ఎతార్కుం తునిందావన్ (ఈటీ)" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో సూర్య ఆడవాళ్ళ మీద జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా గా పోరాడే ఒక సోషల్ ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇవాళ అనగా మార్చి 10, 2022 న విడుదలైంది. ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ:

సినిమా కథ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్తో సాగుతుంది. రెండు ఊర్లో మధ్య జరిగే గొడవల చుట్టూ తిరిగే కథ ఇది. కృష్ణమోహన్ (సూర్య) ఒక లాయర్. అధిరా (ప్రియాంక అరుల్ మోహన్) తో ప్రేమలో పడతాడు. కానీ కామేష్ (వినయ్ రాయ్) అనే ఒక వ్యక్తి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్లతో అసభ్యకర వీడియో లు చేస్తూ ఉంటాడు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్న కామేష్ అంతు చూడాలని కృష్ణమోహన్ నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

సూర్య అద్భుతమైన నటన ఈ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. సినిమా మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ దాకా సూర్య ఎనర్జీ, పర్ఫామెన్స్ సినిమాకి పెద్ద హైలైట్ లుగా మారాయి. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో కూడా ఆకట్టుకున్న సూర్య తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో తన అందంతో మాత్రమే కాక నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. సూర్య తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వినయ్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సత్య రాజ్ మరియు మధుసూదన్ రావు కూడా తమ పాత్రలలో బాగానే నటించారు. జయప్రకాష్ మరియు శరణ్య పొన్వన్నన్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

సినిమా కోసం మంచి కథను ఎంచుకున్నారు డైరెక్టర్ పాండిరాజ్. నెరేషన్ పరంగా అంతగా మెప్పించలేకపోయినప్పటికీ ఒక స్ట్రాంగ్ పాయింట్ ని తీసుకొని దాన్ని చూపించడంలో డైరెక్టర్ మంచి మార్కులు వేయించుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా సెకండ్ హాఫ్ లోని ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా తెరకెక్కించిన పాండిరాజ్ సినిమా రియాలిటీ కి చాలా దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. అది ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇమ్మాన్ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా వరకు సన్నివేశాలను బాగానే హైలైట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసారు. రూబెన్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. రన్ టైం కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది.

బలాలు:

సూర్య నటన

సెకండ్ హాఫ్ లోని ఎమోషన్స్

క్లైమాక్స్ మెసేజ్

బలహీనతలు:

ఫస్ట్ హాఫ్

ఫ్యామిలీ డ్రామా

తమిళ ఫ్లేవర్

చివరి మాట:

సినిమా ఆసక్తికరంగానే మొదలైనప్పటికీ ఫస్ట్ హాఫ్ చాలా సిల్లీగా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో ఉండే ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. అయితే ఈ సినిమా కథ సెకండ్ హాఫ్ లో కొంచెం ఊపందుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఉండే ఎమోషన్స్ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. హీరో విలన్ ల మధ్య వచ్చే కన్ఫ్రన్టేషన్ సన్నివేశాలు ఇంకొంచెం ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. అయితే తమిళం ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఓవరాల్ గా హలో ఫస్టాఫ్ లో కొన్ని డ్రాగింగ్ సన్నివేశాలు తప్ప సినిమా బాగానే అనిపిస్తుంది.

బాటమ్ లైన్:

"ఈటీ" కొన్ని ఆసక్తికరమైన ఎలిమెంట్లు ఉన్న రెగ్యులర్ సోషల్ డ్రామా.

Show Full Article
Print Article
Next Story
More Stories