Jaanu Twitter review: క్లాసిక్ ప్రేమ కథా చిత్రం జాను

Jaanu Twitter review: క్లాసిక్ ప్రేమ కథా చిత్రం జాను
x
Highlights

టాలీవుడ్ లో శర్వానంద్ ప్రస్థానం ప్రత్యేకమైనదనే చెప్పొచ్చు. తన సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు శర్వానంద్....

టాలీవుడ్ లో శర్వానంద్ ప్రస్థానం ప్రత్యేకమైనదనే చెప్పొచ్చు. తన సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు శర్వానంద్. ఇప్పుడు శర్వానంద్ హీరోగా,.సమంత హీరోయినగా తమిళంలో సూపర్ హిట్ అయిన '96' ను తెలుగులో జాను పేరుతో తెరకెక్కించారు. తమిళ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు గురువారం విడుదల అయింది.

తమిళంలో క్లాసిక్ మూవీగా హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయదాంతో రెండిటి మధ్య పోలిక రావడం సహజం. త్రిష అక్కడ కథానాయిక. ఇక్కడ ఆపాత్ర సమంత చేశారు. దీంతో ఇద్దరిలో ఎవరు బాగా చేశారని పోలుస్తూ సినిమా చూస్తారు ప్రేక్షకులు. విజయ్ సేతుపతి తమిళ వెర్షన్ లో అడరగోట్టీశారు. మరి ఆ రేంజిలో శర్వానంద్ నటన ఉందా అని చూడడమూ జరుగుతుంది.

ఇక యూఎస్‌లో ఇప్పటికే 'జాను' ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమా కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ ప్రేమ కథలు ఇష్టపదేవారికి బాగా నచ్చేలా ఉందని చెబుతున్నారు. అంతే కాదు సినిమా చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ ఉంటుందని వారంటున్నారు.

తమిళ మాతృక '96' కు ఎటువంటి మార్పులూ చేయకుండా అలానే తీసేశారట. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు చాలా బాగావచ్చాయని రివ్యూలు రాస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీ లా 'జాను' ఉందని చెబుతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ క్లాసిక్ మూవీ పై ట్విట్టర్ లో వచ్చిన అభిప్రాయలు మీకోసం..






Show Full Article
Print Article
More On
Next Story
More Stories