అందమైన భార్య.. అడ్డుకునే ఆత్మ.. ''పతీ పత్నీ ఔర్ ఓ''

అందమైన భార్య.. అడ్డుకునే ఆత్మ.. పతీ పత్నీ ఔర్ ఓ
x
pati patni aur who web series review
Highlights

లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ జోరు పెరిగింది. చాలా వెబ్ సిరీస్ లు ఆకట్టుకునేలా ఉంటున్నాయి. వాటిలో పతి పత్ని ఔర్ ఓ ఒకటి. ఈ సిరీస్ ఎలా ఉందొ ఓ లుక్కేద్దాం..

అకాల మరణం చెందిన మహిళ.. రెండో పెళ్లి చేసుకున్న భర్త. కొత్తగా పెళ్ళయిన మగువ.. ఆత్మగా మారిన మహిళ ఈ ఇద్దరి మధ్య చేరి చేసే హంగామా.. దీనిమధ్యలో రొమాంటిక్ డ్రామా సింపుల్ గా ఇదీ ''పతీ పత్నీ ఔర్ ఓ'' స్టోరీ లైన్. ఈ లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పడు ఇదే లైన్ తో లాక్ డౌన్ లో ఈ వెబ్ సిరీస్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో సందడి చేస్తోంది.

ఎలా ఉందంటే..

బాలీ వుడ్ సినిమాల్లో ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులు లీడ్ రోల్స్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకునేలా ఉంటుంది. సుల్తాన్ సినిమాలో ఒక పాత్ర చేసిన అనంత్ విధాన్.. అతని మొదటి భార్య (ఆత్మ)గా విన్నీ ఆరోరా.. రెండో భార్యగా రియాసేన్ నటించారు. వీరి ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు చక్కగా వుంటాయి. చనిపోయి ఆత్మగా మారిన మొదటి భార్య.. రెండోభార్య ల మధ్య నలిగిపోయిన వాడిగా అనంత్ విధాన్ మెప్పించారు. వీరి ముగ్గురి మధ్యా రొమాంటిక్ డ్రామా చాలా బావుంటుంది. భర్తలపై భార్యకు ఉండే ప్రేమ ఎలా ఉంటుందో చక్కగా ఆవిష్కరించారు ఇందులో. ఈ రొమాంటిక్ డ్రామాలో హాస్యాన్ని కూడా సరైన పద్ధతిలో చేర్చారు. దీంతో కొన్ని ఎపిసోడ్స్ లో హాస్యం ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే, ఆత్మలు అవి మనుషుల మధ్యలో తమ ఫీలింగ్స్ చూపిస్తూ ఇతరులను ఆవహించడం వంటివి కొంత అసహజంగా అనిపిస్తాయి. డైలాగ్స్ బావున్నాయి.

మొత్తమ్మీద ఈ వెబ్ సిరీస్.. కొన్ని ఎపిసోడ్ లు మినహా ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. కామెడీ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చే అవకాశం ఉంటుంది.

తెరపై కనిపించేది వీరే..

రియా సేన్, ఆనంద్ విధాట్, విన్నీ అరోరా

తెరవెనుక వీరే..

దర్శకత్వం: నిషీత్ నీరవ్ నీల్కాంత్

సంగీతం: సరిత్ శేఖర్ ఛటర్జీ మరియు కరణ్ సాంచల

నిర్మాణ సంస్థ : టు నైస్ మెన్

ఇక్కడ చూడొచ్చు.. ఎమ్ ఎక్స్ ప్లేయర్

గమనిక: ఇది విశ్లేషకుడి కోణం మాత్రమే. ఈ విశ్లేషణ పూర్తిగా రచయిత వ్యక్తిగత అభిప్రాయం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories