RaviTeja Krack Movie : 'క్రాక్ ' మూవీ రివ్యూ

RaviTeja Krack Movie : క్రాక్  మూవీ రివ్యూ
x
Highlights

రవితేజ అంటే.. మాస్ మహారాజ్! మాస్ సినిమాలు చేయడంలో.. మాస్ హీరోగా నటించడంలో రవితేజ ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటాయి.

రవితేజ అంటే.. మాస్ మహారాజ్! మాస్ సినిమాలు చేయడంలో.. మాస్ హీరోగా నటించడంలో రవితేజ ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటాయి. చాలా కాలంగా రవితేజ మాస్ లెవెల్ కి తగ్గ సినిమా పడలేదు. ఇక దర్శకుల్లో గోపీచంద్ మలినేని స్టయిల్ కూడా మాస్. ఆయనకు రవితేజ హీరోగా దొరికితే ప్రేక్షకులకు మాత్రం ఫుల్ మాస్ మసాలా సినిమా దొరికినట్టే. ఈ విష్యం డాన్ శీను.. బలుపు సినిమాలతో రుజువయ్యింది. ఇప్పుడు ఈ యిద్దరూ క్రాక్ అంటూ జత కలిశారు. టీజర్ నుంచే తెలుగు సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేపిన క్రాక్ సినిమా ఇప్పుడు థియేటర్లలో ఉంది. మరి ఈ ఇద్దరి కలయికలో మూడో సినిమా ముచ్చటగా ఉందా లేదా అనేది చూద్దాం!

చెప్పి మరీ గోపీచంద్-రవితేజ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అవును రవితేజ మాస్ ఎనర్జీని మరోసారి వెండితెరమీద అద్భుతంగా వెలిగేలా చేశారు గోపీచంద్. సినిమా ప్రారంభం నుంచీ చివరి వరకూ ఎక్కడా ఆగకుండా.. ఆపకుండా వినోదాన్ని పంచింది క్రాక్ సినిమా. కథ ఇదీ.. వీర శంకర్ (రవితేజ) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. భార్య (శృతిహాసన్),ముద్దులొలికే కొడుకుతో సరదాగా జీవితం సాగిపోతుంది. ఇదే సమయంలో కర్నూలులో టెర్రరిస్ట్ (చిరాగ్ జానీ), ఒంగోలులో కటారి కృష్ణ (సముద్రఖని), కడపలో రౌడీ (రవి శంకర్) లను తన విధుల్లో భాగంగా పట్టుకుంటాడు. దీంతో ఈ ముగ్గురితో వైరం ఏర్పడుతుంది. మరి ఆ వైరం ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో.. క్రాక్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

సాధారణంగా పోలీసు సినిమా కథలన్నీ ఒకేరకంగా ఉంటాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. విధుల్లో ఆటంకాలు.. విలంతో చిక్కులు.. వాటినుంచి బయటపడి హీరో విజయం సాధించడం. బేసిక్ గా ఇదే లైన్ మీద పోలీసు సినిమాల స్టోరీలు ఉంటాయి. ఇది కూడా అదే బేస్ లైన్ మీద అల్లిన కథే. కానీ దీనికోసం గోపీచంద్ ఇచ్చిన కథనం మాత్రం చాలా బావుంటుంది. విలన్లను ఎదుర్కోవడం కోసం మాస్ రవితేజ ఎలాంటి ఎత్తులు వేశారనేది కొత్తగా ఉంటుంది. దీనిని గోపీచంద్ మలినేని చాలా చక్కగా డీల్ చేశారు. సినిమా అంతా కొత్త తరహాలో అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఎనర్జీకి తగ్గ పాత్ర దొరికింది. కుమ్మేశాడు అంతే. చాలాకాలం తరువాత మళ్ళీ రవితేజ తసత్యాలే లో రెచ్చిపోయాడు. ఫుల్ ఎనర్జీ కనిపించింది. సినిమా కథనానికి రవితేజ ఎనర్జీ జోడిగా సరిగ్గా కుదిరింది. ఇక హీరోయిన్ గా శృతి హాసన్ సో..సో. ఎందుకంటే అంత వైవిధ్యం ఉన్న క్యారెక్టరైజేషన్ కాదు. ఇక విలన్ గా చేసిన అందరూ బాగా చేశారు.

తెరవెనుక ఎలా ఉంది..

సినిమాలో అన్ని అంశాలు పూర్తిగా మాస్ దృష్టిలో పెట్టుకునే చేశారు. ఫైట్స్ సినిమాకి ప్రత్యేకంగా ఉన్నాయి. రాంరాం-లక్ష్మణ్ అందియించిన స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‍ సీన్లో టెంపుల్‍ ఫైట్‍, బస్టాండ్‍లో ఫైట్‍ ఈ సినిమాకు హైలైట్‍గా నిలిచాయి. సముద్రఖని పాత్రకు విపరీతమైన హైప్‍తో పరిచయం చేసి హీరోతో ఫస్ట్ కాన్‍ఫ్రంటేషన్‍ సీన్లోనే గాలి తీసేస్తారు. వరలక్ష్మి శరత్‍కుమార్‍ బ్లాంక్‍ ఫేస్‍తో క్లూలెస్‍ అనిపిస్తుంటుంది. అలాగే కామెడియన్ ఆది, అవినాష్‍, సప్తగిరి తదితరులు వున్నా ఏదో అలంకారానికే అన్నట్లుగా ఉంటుంది.

సాంకేతికంగా ఉన్నతంగా నిలిచింది. మూవీ ప్రతి విజువల్స్ చాలా రిచ్‍గా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ జీకే విష్ణు తీసిన విధానం ఓరేంజ్ లో ఉంది. యాక్షన్‍ సీన్స్పై అడిషినల్‍ ఫోకస్‍ పెట్టినట్టు కనిపిస్తుంది. తమన్ అందించిన పాటలు హూషారెత్తింస్తాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా మాస్‍ని దృష్టిలో పెట్టుకుని వారిని మెప్పించడానికి తీసినట్లు ఉంది.

గమనిక : ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. పూర్తి సినినిమాను థియేటర్ కి వెళ్లి చూడగలరు

Show Full Article
Print Article
Next Story
More Stories