Ranga Ranga Vaibhavanga: రంగరంగ వైభవంగా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Ranga Ranga Vaibhavanga Movie Review
x

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా మూవీ రివ్యూ..

Highlights

Ranga Ranga vaibhavanga: రంగ రంగ వైభవంగా మూవీ రివ్యూ..

చిత్రం: రంగ రంగ వైభవంగా

నటీనటులు: వైష్ణవ్ తేజ్, నవీన్ చంద్ర, అలి, కేతిక శర్మ, సుబ్బరాజు తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుదీన్

నిర్మాత: బీ వీ ఎస్ ఎన్ ప్రసాద్

దర్శకత్వం: గిరీశయ్య

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

విడుదల తేది: 02/09/2022

సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా "ఉప్పెన" సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో "కొండ పొలం" అనే సినిమాలో నటించాడు కానీ ఆ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయాడు. తాజాగా ఇప్పుడు "రంగ రంగ వైభవంగా" అనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల మధ్య ఇవాళ అనగా సెప్టెంబర్ 2, 2022 న ఈ సినిమా థియేటర్ లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూసేద్దామా..

కథ:

రిషి (వైష్ణవ్ తేజ్) మరియు రాధా (కేతిక శర్మ) ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా సన్నిహిత్యంగా ఉండేవారు. కానీ ఇద్దరికీ చిన్నప్పటినుంచి చాలా ఇగో ఉండేది. అలాంటి వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఒకరి తో ఒకరు మాట్లాడుకోకుండా వారి ప్రయాణం ఎలా సాధ్యమైంది? చివరికి ఏమైంది వంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

"కొండపొలం" సినిమాతో పోలిస్తే వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో చాలా విభిన్నంగా కనిపించాడు. అతని క్యారెక్టర్రైజేషన్ పరవాలేదు అనిపిస్తుంది కానీ చాలా రొటీన్ పాత్రలో కనిపించారు. నటన మరియు బాడీ లాంగ్వేజ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్నారు. కేతిక శర్మ రెండవ సినిమా అయినప్పటికీ బాగానే నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. రొమాంటిక్ లో చాలా బోల్డ్ గా కనిపించిన ఈమె ఈ సినిమాలో మాత్రం చాలా ట్రెడిషనల్ గా మరియు అప్పుడప్పుడు స్టైలిష్ గా కూడా కనిపించింది. ఆమె నటన చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలి కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించారు. నవీన్ చంద్ర నటన కూడా ఈ సినిమాకి బాగానే ప్లస్ అయింది. సుబ్బరాజు కూడా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. మిగతా నటినటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఇంతకుముందు తమిళ్లో "అర్జున్ రెడ్డి" సినిమాని రీమేక్ చేసిన గిరీశయ్య ఇప్పుడు తెలుగులో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. నెరేషన్ పరంగా బాగానే అనిపించినప్పటికీ కథ చాలా రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. చాలా వరకు కథ ఎప్పుడో చూసేసినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఈ సినిమాకి బాగానే ప్లస్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. నేపథ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా సెట్ అయింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ కూడా సినిమాకి మంచి విజువల్స్ ను అందించారు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

సంగీతం

నిర్మాణ విలువలు

నటీనటులు

బలహీనతలు:

రొటీన్ కథ

ప్రెడిక్టబుల్ స్టోరీ

చివరి మాట:

సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ని చాలా బాగా చూపించారు. వారి పాత్రలను విభిన్నంగా చూపించినప్పటికీ కథ మాత్రం చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంత కామెడీతో బాగానే నడుస్తుంది. ఇంటర్వెల్లో కథ కొంచెం మలుపు తిరుగుతుంది కానీ సెకండ్ హాఫ్ కూడా మళ్లీ అంతే స్లోగా నడవటంతో ప్రేక్షకులకు కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇక క్లైమాక్స్ కూడా చాలా నార్మల్ గా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. కామెడీ కూడా కొన్నిచోట్ల బాగానే వర్క్ అవుట్ అయినప్పటికీ మరికొన్నిచోట్ల చిరాకు తెప్పిస్తుంది.

బాటమ్ లైన్:

"రంగ రంగ వైభవంగా" కేవలం ఒకసారి చూడదగ్గ ప్రెడిక్టబుల్ రొటీన్ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories