'పేట' మూవీ రివ్యూ

Petta
x
Petta
Highlights

టాలీవుడ్ లో సైతం బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో మొదటి పేరు రజినీకాంత్ దే ఉంటుంది. సూపర్ స్టార్ రజిని కి సౌత్ ప్రేక్షకులలో క్రేజే వేరు. రజిని సినిమా అంటే తమిళంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో కూడా హడావిడి మొదలవుతుంది.

చిత్రం: పేట

నటీనటులు: రజనీకాంత్, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, శశికుమార్, బాబీ సింహ, నవాజుద్దీన్ సిద్ధికీ తదితరులు

సంగీతం: అనిరుద్ రవిచందర్

ఛాయాగ్రహణం: తిర్రు

ఎడిటింగ్‌: వివేక్ హర్షన్

మాటలు: ఎం. రాజశేఖర్ రెడ్డి

నిర్మాత: కళానిధి మారన్

దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్

బ్యానర్: సన్ పిక్చర్స్

విడుదల తేదీ: 10/01/2019

టాలీవుడ్ లో సైతం బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో మొదటి పేరు రజినీకాంత్ దే ఉంటుంది. సూపర్ స్టార్ రజిని కి సౌత్ ప్రేక్షకులలో క్రేజే వేరు. రజిని సినిమా అంటే తమిళంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో కూడా హడావిడి మొదలవుతుంది. అయితే గత కొంతకాలంగా 'కబాలి' 'కాలా' లాంటి సినిమాలు ఏవి తెలుగులో హిట్ అవ్వలేదు. మంచి ఓపెనింగ్స్ లభించినప్పటికీ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. '2.ఓ' తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఒక మాస్ ఎంటర్టైనర్ 'పేట' అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా జనవరి 10న విడుదలైంది. మరి సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ:

కాళీ(రజినీకాంత్) ఒక కాలేజ్ లో హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ తలెత్తే సమస్యల్ని తనదైన రీతిలో పరిష్కరిస్తూ అక్కడ వారికి సహాయం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే మేఘ ఆకాష్, సనత్ ల పెళ్లి కూడా జరిపిస్తాడు. ఆ సమయంలోనే అతనికి లోకల్ గుండా తో చిన్న సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల అతని ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. కాళీ అసలు పేరు పేట. అతను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాడు. అసలు కాళీ ఎవరు? ఉత్తరప్రదేశ్ నుండి ఎందుకు వచ్చి పేరు మార్చుకున్నాడు? అక్కడ తలెత్తిన సమస్యతో ఎలా పోరాడాడు అనేదే సినిమా కథ.

నటీనటులు:

ఈ సినిమాలో రజనీకాంత్ నటన అదిపోయింది. ఎప్పుడో 90 లో చూసిన రజనీకాంత్ స్టైల్ మళ్లీ ఈ సినిమాలో కనిపించింది. ఒకవైపు హాస్టల్ వార్డెన్ గా నటిస్తున్నప్పుడు చాలా చార్మింగ్ గా కనిపించిన రజినీకాంత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మాస్ లుక్ తో అదరగొట్టాడు. 'భాషా' సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజిలో ప్రేక్షకులను మెప్పిస్తాడు రజిని. ఈ సినిమాకు విజయ్ సేతుపతి నటన కూడా బలాన్ని చేకూర్చింది. ఎలాంటి పాత్రలోనైనా వైవిధ్యాన్ని తీసుకురాగల విజయ్ ఈ సినిమాలో కూడా చాలా సులువుగా తన పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. సిమ్రాన్ కూడా ఎప్పటిలాగానే చాలా నాచురల్ గా నటించింది. రజనీకాంత్, సిమ్రాన్ మధ్య సీన్లు చాలా బాగా వచ్చాయి. త్రిష ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించింది అలానే చాలా అందంగా కూడా ఉంది. ఆమె నటనతో కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎం శశికుమార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్రకు ప్రాణం పోసినట్లు నటించారు. బాబీ సింహ కూడా ఈ సినిమాలో చాలా బాగా కనిపించారు. మిగతా నటీనటులు కూడా సహజంగా నటించారు.

సాంకేతిక వర్గం:

కథలో పెద్ద కొత్తదనం ఏమీ లేకపోయినా, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సినిమాను మలచిన విధానం చాలా బాగుంది. ఎప్పుడో 90 లో రజనీ లో కనిపించిన ఎనర్జీ, స్టైల్ మరియు మాస్ ఇమేజ్ తో మళ్లీ ఈ సినిమాలో రాజినిలో కనిపించడం విశేషం. ఆ క్రెడిట్ మొత్తం కార్తీక్ సుబ్బరాజ్ కు ఇవ్వచ్చు. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అశోక్ వల్లభనేని 'పేట'ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రజినీకాంత్‌కు అనిరుధ్ సంగీతం అందించడం ఇదే మొదటిసారి కానీ రజిని ఇమేజ్ కి తగ్గట్టు చక్కని నేపధ్య సంగీతం కూడా అందించాడు. తిర్రు అందించిన విజువల్స్ ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అందమైన లోకేషన్లు కూడా కనపడతాయి. ఇక వివేక్ హర్షన్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపించుకుంది.

బలాలు:

రజినీకాంత్

నేపధ్య సంగీతం

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం

బలహీనతలు:

సెకండ్ హాఫ్

కథ స్లో గా నడవడం

చివరి మాట:

మొత్తానికి చాలా కాలం తరవాత పాత తలైవా రజినీ ని గుర్తుచేసే సినిమా ఇది. 'మాస్ మరణం' ప్రస్తుతం రజినీ అభిమానుల నినాదంగా మారింది. అసలు అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ 'పేట' చిత్రం కచ్చితంగా రజిని ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉంటుంది.

బాటమ్ లైన్:

'పేట' రజిని ఫ్యాన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories