Radhe Shyam Twitter Review: రాధే శ్యామ్ ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..?

Radhe Shyam Twitter Review: బ్యూటీఫుల్ లవ్ స్టోరి. రాధా కృష్ణ కుమార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

Shireesha
Updated on: 11 March 2022 7:42 AM IST
Radhe Shyam Movie Twitter Genuine Review Telugu | Radhe Shyam Review Telugu
X

Radhe Shyam Twitter Review: రాధే శ్యామ్ ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..?

Radhe Shyam Twitter Review: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి నిజంగానే పండ‌గ వ‌చ్చేసింది. మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న న‌టించిన 'రాధే శ్యామ్' రిలీజైంది. వ‌రుస యాక్ష‌న్ సినిమాల‌ను చేయ‌డం కంటే డిఫ‌రెంట్ క‌థాంశంతో సినిమా చేయాల‌ని ప్ర‌భాస్ ఓకే చెప్పిన పీరియాడిక్ ల‌వ్ స్టోరి 'రాధే శ్యామ్'.

'రాధే శ్యామ్' సినిమాను యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కించారు. ప్ర‌భాస్ జోడీగా పూజా హెగ్డే న‌టించింది. సినిమాను మేక‌ర్స్ మూడు వంద‌ల కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు పెట్టి భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కించారు. యూర‌ప్‌లో జార్జియా, ఇట‌లీ వంటి దేశాల్లో షూటింగ్ చేశారు. అలాగే క‌రోనా స‌మ‌యంలో భారీ సెట్స్ వేసి హైద‌రాబాద్‌లోనే చిత్రీక‌రించారు. సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేశాయి. టాలీవుడ్‌కి చెందిన సినీ ప్ర‌ముఖులంద‌రూ సినిమా గురించి స్పెష‌ల్‌గా ట్వీట్స్ చేశారు. ఇంత భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ మీద రిలీజైన 'రాధే శ్యామ్' గురించి ఫ్యాన్స్‌, ఆడియెన్స్‌, నెటిజ‌న్స్ ఏమంటున్నారంటే...

బ్యూటీఫుల్ లవ్ స్టోరి. రాధా కృష్ణ కుమార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. గ్రేట్ విజువల్స్. ప్రభాస్, పూాజా హెగ్డే జంట చక్కగా ఉన్నారు. తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంటే.. సెకండాఫ్ ఎక్సలెంట్. కథను నడిపిన తీరు, సినిమాలోని ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్. పాటలు, విజువల్స్ గురించి మరో మాట చెప్పనక్కర్లేదు. ప్రభాస్ లుక్,ఫెర్ఫామెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. తమన్ బీజీఎం ఔట్ స్టాండింగ్...

ప్రభాస్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లెంది. సినిమా సెకండాఫ్ ఎక్సలెంట్.




Shireesha

Shireesha

Next Story