Romantic Movie Review: రొమాంటిక్ సినిమా రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Puri Jagannadh Son Akash Puris Romantic Movie Review | Tollywood News Today
x

Romantic Movie Review: ఆకాశ్ పూరి నటించిన రోమాంటిక్ సినిమా రివ్యూ

Highlights

Romantic Movie Review: తాజాగా ఇన్నాళ్ళకి మళ్ళీ ఆకాష్ హీరోగా "రొమాంటిక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Romantic Movie Review: డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు తనయుడు ఆకాష్ పూరి "మెహబూబా" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు. కానీ మొదటి సినిమా మాత్రం అంతగా ఆడకపోయినా ఆకాష్ పూరి కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. తాజాగా ఇన్నాళ్ళకి మళ్ళీ ఆకాష్ హీరోగా "రొమాంటిక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కొత్త దర్శకుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకి సంబంధించిన కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగులు పూరిజగన్నాథ్ అందించారు. పూరి జగన్నాథ్ చార్మి కవర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇవ్వాళ అనగా అక్టోబర్ 29న విడుదలైన థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

  • చిత్రం: రొమాంటిక్
  • నటీనటులు: ఆకాష్ పూరి, కేతికా శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్, సునైనా, సతీష్ సరిపల్లి, సత్య ఆదిత్య, తదితరులు
  • సంగీతం: సునీల్ కశ్యప్
  • సినిమాటోగ్రఫీ: నరేష్ కే రానా
  • నిర్మాత: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్
  • దర్శకత్వం: అనిల్ పాడూరి
  • బ్యానర్: పూరి కనెక్ట్స్
  • విడుదల తేది: 29/10/2021

కథ:

వాస్కో డా గామా (ఆకాష్ పూరి) గోవాలోని స్లం ప్రాంతాల్లో పుట్టి పెరిగాడు. అక్కడే డ్రగ్ డీలింగ్ చేసే ఒక గుండాల గ్యాంగ్ తో చేతులు కలుపుతాడు వాస్కో. జీవితం మారిపోయే ఒక పెద్ద డీల్ ని ఒప్పుకొని ఆ పనిలో పడతాడు కానీ కొన్ని అనుకోని సంఘటనల వలన ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేయాలి వస్తుంది.

దీంతో మరింత పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు వాస్కో. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తన వెనక పడుతూ ఉంటుంది. మరోవైపు వాస్కో మౌనిక (కేతీక శర్మ) తో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉంటాడు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమ్యకృష్ణ వాస్కోని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది. చివరికి ఏమైంది అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

మొదటి సినిమాతో పోలిస్తే ఆకాష్ పూరి ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. తన నటనలో మెచ్యూరిటీ బాగా కనిపించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో అయినా యాక్షన్ సన్నివేశాల్లో అయినా ఆకాష్ నటన సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు ఆకాష్.

కేతిక శర్మ కూడా తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ముఖ్యంగా తన కెమిస్ట్రీ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. రమ్యకృష్ణ నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. రమ్యకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. ఉత్తేజ్ తన పాత్రలో బాగానే మెప్పించాడు. సునయన కూడా పర్వాలేదు అనిపించింది.

సాంకేతిక వర్గం:

సినిమా మొత్తం యూత్ ఫుల్ ఎలిమెంట్స్తో నింపేశారు అనిల్ పాడూరి. ఈ కథని బాగానే హ్యాండ్ చేశారని చెప్పుకోవచ్చు. మొదటి హాఫ్ మొత్తం కొంచెం స్లోగా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్ గా ఆసక్తికరంగా నడుస్తుంది. అయితే కథ మాత్రం చాలా రొటీన్ గా అనిపించడంతో ప్రేక్షకులు కొంచెం బోర్ గా ఫీల్ అవుతారు.

చాలా వరకు కథ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తర్వాత ఏం జరుగుతుంది అని మనం ముందే ఊహించ వచ్చు. డైలాగులు చాలా బాగున్నాయి. పాటలు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి.

బలాలు:

  • నటీనటులు
  • పాటలు
  • సెకండ్ హాఫ్
  • క్లైమాక్స్

బలహీనతలు:

  • రొటీన్ కథ
  • ప్రెడిక్టబుల్ సన్నివేశాలు

చివరి మాట:

నటీనటుల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అనిల్ పాడూరి దర్శకత్వం పర్వాలేదు అనిపించింది. అయితే పూరి జగన్నాథ్ అందించిన కథ, స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా అనిపిస్తాయి. చాలా వరకు కథ అనుకున్న విధంగానే సాగుతూ ఉంటుంది. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు. ఫస్టాఫ్ కొంచెం స్లో గా ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం బాగానే అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ మధ్య ప్రేమ కథ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.

బాటమ్ లైన్:

రొటీన్ గా సాగే "రొమాంటిక్" ప్రేమ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories