Prabhas Radhe Shyam Movie Review: ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' టాక్‌ ఎలా ఉందంటే..

Prabhas Radhe Shyam Movie Review Telugu
x

Prabhas Radhe Shyam Movie Review: ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ టాక్‌ ఎలా ఉందంటే..

Highlights

Prabhas Radhe Shyam Movie Review: ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' టాక్‌ ఎలా ఉందంటే..

Radhe Shyam Movie Review:

చిత్రం: రాధే శ్యామ్

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణం రాజు, భాగ్య శ్రీ, సత్య రాజ్, జగపతి బాబు, సచిన్ ఖెడేకర్, ప్రియదర్శి తదితరులు

సంగీతం: ఎస్ ఎస్ థమన్, జస్టిన్ ప్రభాకరన్ (పాటలు)

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీద

దర్శకత్వం: రాధ కృష్ణ

బ్యానర్: టీ సిరీస్, యూ వీ క్రియేషన్స్

విడుదల తేది: 11/03/2022

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఫాంటసీ ప్రేమకథ రాధేశ్యామ్. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. చాలాకాలం తరువాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూశారు. ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ, మురళి శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా మార్చి 11, 2022 లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ అలరించిందో చూసేద్దామా..

కథ:

సినిమా కథ మొత్తం 1976 బ్యాక్ డ్రాప్తో సాగుతుంది. విక్రమాదిత్య (ప్రభాస్) ఒక ప్రముఖ హస్తసాముద్రికుడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీలు ఒక్కసారైనా విక్రమాదిత్య ని కలవాలి అని తమ భవిష్యత్తుని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. భారతదేశ ప్రధానమంత్రి కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని విక్రమాదిత్యని కలిసి తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి విక్రమాదిత్య భారతదేశం నుండి వెళ్ళిపోతారు. ఎంతో మంది డాక్టర్లు పూజా హెగ్డే కి ఉన్న వ్యాధి వల్ల ఆమె ఎక్కువ కాలం బతకదు అని చెబుతారు కానీ విక్రమాదిత్య మాత్రం ఆమె చాలా కాలం బతుకుతుంది అంటాడు. ప్రేరణ విషయంలో విక్రమాదిత్య ప్రెడిక్షన్లు నిజమయ్యాయా? వారిద్దరి మధ్య ప్రేమ చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

ప్రభాస్ అద్భుతమైన నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ ఒక ప్రేమ కథ లో నటిస్తున్నాడు అని అభిమానులు కొంచెం కంగారు పడినప్పటికీ, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలివేషన్లు అభిమానులకు కచ్చితంగా నచ్చుతాయి. ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే ఒదిగిపోయి చాలా బాగా నటించింది. ప్రభాస్ తో పూజా హెగ్డే కెమిస్ట్రీ ఈ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది. సత్య రాజ్ నటన కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సచిన్ ఖేడేఖర్, మురళీ శర్మ కూడా తమ పాత్రలలో చాలా బాగా నటించారు. ప్రియదర్శి స్క్రీన్ టైం కొంచెం తక్కువ అయినప్పటికీ, తన పాత్రలో బాగానే నటించాడు.

సాంకేతిక వర్గం:

సినిమా కథ బాగానే ఉన్నప్పటికీ డైరెక్టర్ రాధాకృష్ణ నరేషన్ విషయంలో ప్రేక్షకులను బాగా నిరాశ పరుస్తారు. చాలావరకు ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్లను పరిచయం చేయడంలోనే సరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో రాధాకృష్ణ మరింత స్లో గా మారుతుంది. కథలు సోల్ లేకపోవడం తో ప్రేక్షకులు కూడా సినిమాకి అంతగా కనెక్ట్ అవ్వలేక పోతారు. అయితే కథ పక్కన పెడితే, ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సెట్ డిజైన్ లు లొకేషన్ లు చాలా అద్భుతంగా ఉన్నాయి. యు వి క్రియేషన్స్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మనోజ్ పరమహంస అందించిన విజువల్స్ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పవచ్చు. థమన్ నేపథ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

విజువల్ ఎఫెక్ట్స్

ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్

సాంకేతిక వర్గం

బలహీనతలు:

సెకండ్ హాఫ్

కథలో సోల్ లేకపోవడం

నెరేషన్ స్లో గా ఉండడం

చివరి మాట:

సినిమా బాగానే మొదలైనప్పటికీ ఆఖరి దాక ఆ ఫ్లో మెయింటెన్ అవ్వకపోవడం ప్రేక్షకులను కొంచెం నిరాశ పరుస్తుంది. నటీనటులు విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగున్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం తో ప్రేక్షకులు కథ కి అంతగా కనెక్ట్ అవ్వలేరు. ఫస్టాఫ్ మొత్తం చాలా ఆర్టిస్టిక్ గా, కనుల విందు చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. విక్రమాదిత్య పాత్రని చాలా ట్రెండీగా చూపించారు. ఫస్టాఫ్ లోని కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే పేరుకి ప్రేమకథ అయినప్పటికీ కథలో మ్యాజిక్ లేకపోవడం తో సినిమా చాలా డల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా నటిం నటీనటుల అద్భుతమైన ఫర్ఫార్మెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, మంచి మ్యూజిక్ తప్ప సినిమాలో పెద్ద చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఏవీ లేవు.

బాటమ్ లైన్:

"రాధే శ్యామ్" ఒక సోల్ లేని మామూలు ప్రేమ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories