Peddha Kapu 1 Movie Review: పెదకాపు-1 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Peddha Kapu 1 Movie Review
x

Peddha Kapu 1 Movie Review: పెదకాపు-1 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Highlights

Peddha Kapu 1 Movie Review : పెదకాపు-1 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Peddha Kapu 1 Movie Review:

'పెదకాపు-1'

నటి నటులు: విరాట్ కర్ణ

ప్రగతి శ్రీ వాస్తవ

శ్రీకాంత్ అడ్డాల

రావు రమేష్

నాగబాబు

అనసూయ

ఈశ్వరి రావు

దర్శకుడు: శ్రీకాంత్ అడ్దాల

మ్యూజిక్ : మిక్కీ జే మేయర్

ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు తన హవాను కొనసాగిస్తున్నాయి. ఈ మధ్యనే వచ్చిన బేబి సినిమా కూడా చిన్న సినిమాగానే వచ్చి మంచి హిట్ సాధించింది. నేడు మరో చిన్న సినిమా విడుదలైంది .. అదే పెదకాపు 1 అనే టైటిల్‌తో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. కొంతకాలం తరువాత వెంకటేష్ నారప్ప చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల నారప్ప లాంటి రా అండ్ రస్టిక్ మాస్ చిత్రాలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. తాజాగా పెదకాపు చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చాడు.. మరి సినిమా ఎలావుందో రివ్యూ లో చూద్దాం.

1980 నేపథ్యంలో కథ మొదలవుతుంది. రాజమండ్రి ప్రాంతంలోని ఓ గ్రామంలో సత్య రంగయ్య (రావు రమేష్), భయ్యన్న ( నరేన్) మధ్య ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం ఆదిపత్యం కొనసాగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా గ్రామంలో గొడవలు, నెలకొంటాయి. ఆర్థికంగా, సామాజికంగా తక్కువ కులాలపై అగ్రవర్ణాల వివక్ష కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో అంటే 1983 సంవత్సరంలో ఒక సినిమా పెద్దాయన ఒక ప్రాంతీయ పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) పార్టీ జెండాను గ్రామంలో ఎగురవేసి సత్య రంగయ్య, భయ్యన్నకు సవాల్ విసురుతాడు. బలమైన సత్య రంగయ్య, భయ్యన్నలను ఎదుర్కొని పెద్ద కాపు గెలిచాడా..? అక్కమ్మ (అనసూయ) కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల) ప్రమేయం ఏంటి అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

మొదటి సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కర్ణ బాగానే నటించాడు. అనుభవం ఉన్న నటుడిగా మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాల్లో లో పాయింట్స్, ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదనిపించాడు. స్వార్థ రాజకీయ నాయకుడి పాత్రకు రావు రమేష్ సరిగ్గా సరిపోయాడు. ప్రాంతీయ పార్టీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా కావడమే కాకుండా కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ప్రగతి శ్రీవాస్తవ, తనికెళ్ల భరణి , నాగబాబు అనసూయ, రాజీవ్ కనకాల, వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. శ్రీకాంత్ అడ్డాల మొదటి సరిగా తెరపై నటించి శబాష్ అనిపించుకున్నారు.

టెక్నికల్ గా పెదకాపు చర్చించుకునే ముందు ఛోటా కె నాయుడు కెమరాపనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు కమర్షియల్ సినిమాకి కలర్ ఫుల్ రంగులు అద్దిన చోటా .. పెదకాపుతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. సెకండాఫ్‌లో సత్య రంగయ్య మరణాంతరం పరిస్థితులు, అలాగే పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ చూపించిన విధానంలో

దర్శకుడు సక్సెస్ ఐయ్యాడు. శ్రీకాంత్ అడ్డాలా మొదటిసారి కులరాజకీయాలు, పార్టీల చుట్టూ కథను రాసుకున్నారు. కానీ అందులో బలం లేదు. దాన్ని తెరపై ప్రజెంట్ చేయడంలో విజయం సాధించాడని చెప్పచ్చు. చివరగా చెప్పాలంటే యాక్షన్ , మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మాత్రమే అలరిస్తుందని చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories