రివ్యూ: 'ఓ పిట్ట కథ'

O pitta katha Movie poster
x
O pitta katha
Highlights

బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఓ.. పిట్ట కథ'.. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకేకేక్కిన ఈ సినిమాని చెందు మద్దు దర్శకత్వం వహించారు.

బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఓ.. పిట్ట కథ'.. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకేకేక్కిన ఈ సినిమాని చెందు మద్దు దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు... సినిమాకి ముందు రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. అందుకు తోడు స్టార్ హీరోలు చిరంజీవి, మహేష్ , ఎన్టీఆర్, ప్రభాస్ ప్రమోట్ చేయడంతో సినిమాకి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. ఇక భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం..

కథ:

ఇక కథలోకి వెళ్తే కాకినాడలోని వెంకటలక్ష్మి థియేటర్‌ ని నడుపుతుంటాడు వీర్రాజు .. అతనికి వెంకటలక్ష్మి అనే కూతురు ఉంటుంది. ఇక అదే థియేటర్‌లో పనిచేసే ప్రభు (సంజయ్‌ రావ్‌) వెంకటలక్ష్మిని చిన్నప్పటినుంచి ఇష్టపడుతాడు. తన ప్రేమను చెప్పే క్రమంలో అయితే చైనా నుంచి వచ్చిన వీర్రాజు మేనల్లుడు క్రిష్ (విశ్వంత్‌) వస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే అతను కూడా వెంకటలక్ష్మిని ప్రేమిస్తాడు. తమ మనుసులోని మాటను వెంకట్ లక్ష్మికి చెప్పే లోపే వెంకటలక్ష్మి కిడ్నాప్‌ అవుతుంది. వెంకటలక్ష్మి కిడ్నాప్‌ కేసును కాకినాడ ఎస్సై అజయ్‌ కుమార్‌ (బ్రహ్మాజీ) ఇన్వెస్టిగేట్‌ చేస్తాడు. ఇంతకి వెంకట్ లక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారు. ప్రభు, క్రిష్‌లలో వెంకటలక్ష్మి ఎవరిని ప్రేమిస్తుంది? అన్నది తెలియాలంటే మాత్రం ఓ.. పిట్ట కథ ని చూడాల్సిందే..

ఎలా ఉందంటే ?

ఓక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ఇష్టపడడం.. ఇదేమి కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు.. ఇది కూడా అదే తరహ కాన్సెప్ట్ అయినప్పటికీ దర్శకుడు మలిచిన తీరు ఓ అద్భుతమని చెప్పాలి. మొదటిభాగం అంత రెగ్యులర్ కథతో, కామెడీ సన్నివేశాలతో నడిపించిన దర్శకుడు అసలు కథనంతా రెండో భాగంలో రివిల్ చేశాడు. రెండవభాగంలో ఒక్కో ట్విస్ట్ ని రీవీల్ చేస్తూ ఆధ్యంతం ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించాడు. అసలేం ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్‌ ప్రేక్షకుడికి కలగక మానదు. ఇక క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. చివరివరకు సస్పెన్స్ మైంటైన్ చేయడం, మొదటిసినిమాని ఇంతా ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు ప్రతిభకు వందకి వంద మార్కులు వేయాల్సిందే..

నటినటులు ;

ఈ సినిమాలో నటినటులు ఎవరికీవారే పోటిపడి నటించారు. ప్రతి ఒక్కరి పాత్ర సినిమాకి బలంగా నిలిచింది. సంజయ్‌, విశ్వంత్‌, నిత్యాశెట్టి ల నటన సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలిచింది. సంజయ్‌ రావు కి మొదటి సినిమా అయినప్పటికీ నటనలో పరిణితిని కనబరిచాడు. నిత్యాశెట్టి అందంతో ఆకట్టుకుంది. ఇక బ్రహ్మాజీ తనకున్నా పాత్ర పరిధి మేరకు బాగా ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటినటులు ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం :

సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇక ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం, నేపధ్య సంగీతం ఆకట్టుకుంది.. ఎడిటింగ్ పైన ఇంకాస్తా ద్రుష్టి పెడితే బాగుండేది..

ఓవరాల్ గా చిన్న పిట్ట కథే అయిన కూత ఘనంగా ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories