logo
సినిమా రివ్యూ

Thank You Movie Review: నాగచైతన్య 'థ్యాంక్యూ' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Thank You Movie Review: నాగచైతన్య థ్యాంక్యూ మూవీ  రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
X

Thank You Movie Review: నాగచైతన్య ‘థ్యాంక్యూ’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Thank You Movie Review: నాగచైతన్య ‘థ్యాంక్యూ’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Thank You Movie Review:

చిత్రం: థాంక్యూ

నటీనటులు: నాగ చైతన్య, రాశి ఖన్నా, మాలవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు

సంగీతం: ఎస్ ఎస్ తమన్

సినిమాటోగ్రఫీ: పీ సీ శ్రీరామ్

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్

దర్శకత్వం: విక్రమ్ కే కుమార్

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

విడుదల తేది: 22/07/2022

ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యువ హీరో నాగ చైతన్య తాజాగా ఇప్పుడు "థాంక్యూ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "మనం" తరువాత విక్రమ్ కే కుమార్ మరియు నాగచైతన్య కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండవ సినిమా ఇది. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శక నిర్మాతలు మరియు నటీనటులు భారీగానే ప్రమోట్ చేశారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు దూరంగా ఉన్నప్పటికీ నాగచైతన్య సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా ఇవాళ అనగా జూలై 22న విడుదలైంది. మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎంతవరకు మెప్పించారో చూసేద్దామా..

కథ:

మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి పెరిగిన అభిరామ్ (నాగచైతన్య) అమెరికా వెళ్లి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. ఆ సమయంలో ప్రియ (రాశి ఖన్నా) తనకి ఆర్థికంగా సహాయం చేస్తుంది. కానీ అభిరామ్ తన కలను నిజం చేసుకునే ప్రాసెస్ లో తన క్యారెక్టర్ నే కోల్పోతాడు. ఇతరుల మనోభావాల గురించి పట్టించుకోకుండా కేవలం తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి లాగా మారతాడు. తన అహంకారం వల్ల అందరూ తనకి దూరం అవుతూ ఉంటారు. కానీ ఒక ఎమోషనల్ సంఘటన తర్వాత అభిరామ్ అందరి విలువను తెలుసుకుంటాడు. ఆ సంఘటన ఏంటి? తన జీవితంలో అభిరామ్ ఎవరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు? అభిరామ్ మళ్లీ మంచి మనిషి లాగా మారాడా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

నాగచైతన్య నటన ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కథ మరియు స్క్రీన్ ప్లే ఎలా ఉన్నప్పటికీ నాగచైతన్య తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. రెండు షేడ్లు ఉన్న పాత్ర అయినప్పటికీ నాగచైతన్య చాలా సులువుగా ఆ పాత్రను పోషించారు. రాశి ఖన్నా పాత్ర కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. రాశి మరియు నాగచైతన్య ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అయితే ఎమోషనల్ సన్నివేశాలను పక్కన పెడితే రాశి ఖన్నా చాలా బాగా నటించింది. మాళవిక నాయర్ మరియు అవికా గోర్ లు కూడా తమ పాత్రలలో బాగానే నటించారు. అవికా గోర్ మరియు నాగచైతన్యాల మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సాయి సుశాంత్ రెడ్డి కూడా తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నారు. సంపత్ రాజ్ మరియు ప్రకాష్ రాజ్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించే సినిమాలలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. కానీ థాంక్యూ సినిమాలో అది మిస్ అయింది అని చెప్పొచ్చు. మామూలుగా విక్రమ్ కుమార్ సినిమాలలో కనిపించే కొత్తదనం ఈ సినిమాకి లేదు. సినిమా కథ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తో కథను ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరంగానే తీయొచ్చు కానీ విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే పరంగా కూడా అంతగా మెప్పించలేకపోయారు. ఎస్ ఎస్ తమన్ అందించిన సంగీతం కూడా కేవలం యావరేజ్ గానే నిలిచింది. పాటలు మాత్రమే కాక నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పీ సీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాలలోని క్లోజప్ షాట్లు చిరాకు తెప్పించినప్పటికీ మిగతా విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. డైలాగ్ లు కూడా పరవాలేదు అనిపించాయి.

బలాలు:

నాగచైతన్య

ఫస్ట్ హాఫ్

పీసీ శ్రీరామ్ విజువల్స్

బలహీనతలు:

నెరేషన్

రొటీన్ కథ

సంగీతం

ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా లేకపోవడం

సెకండ్ హాఫ్

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగానే మొదలవుతుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ తో, నాగచైతన్య నటనతో సినిమా సాఫీ గానే ముందుకు సాగుతుంది. ఫ్లాష్ బాక్ సన్నివేశాలు పరవాలేదు అనిపిస్తాయి. ఇంటర్వెల్ సన్నివేశం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా సాగుతుంది. రెండవ ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యే సమయానికి కథ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. దీంతో ప్రేక్షకులకు స్క్రీన్ ప్లే చాలా రష్ చేసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో చై మరియు రాశి ఖన్నా ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఎంటర్టైన్మెంట్ తగ్గి ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువ అవ్వడం మరియు నెరేషన్ కూడా చాలా స్లోగా ఉండటంతో సినిమా కేవలం యావరేజ్ గా నిలిచింది.

బాటమ్ లైన్:

"థాంక్యూ" ఎమోషనల్ డోస్ బాగా ఎక్కువైన రొటీన్ కథ.

Web TitleNaga Chaitanya's Thank You Movie Reviewed | Tollywood
Next Story